శ్రుతి హాసన్ లవర్‌‌తో విడిపోవడానికి కారణమిదేనా..?

శ్రుతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికతో బ్రేకప్ చేసుకున్నట్టు దాదాపు కన్ఫామ్ అయింది.

సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, వారి ఫోటోలు డీలిట్ చేయడంతో ఈ విషయం బయటికి వచ్చింది.

శాంతనుకు శ్రుతి హాసన్ ఎందుకు బ్రేకప్ చేప్పింది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా పెద్ద ప్రశ్న.

అయితే దీనికి ఓ రీజన్ ఉంది అన్నట్టు టాక్ వస్తుంది.

కొన్ని రోజుల క్రితం శాంతను ముందు శ్రుతి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టిందట.

దానికి శాంతను ఇప్పుడే పెళ్లి వద్దు అనేలా సమాధానం చెప్పాడట. దీంతో ఇద్దరి మధ్య మనస్ఫార్థాలు వచ్చినట్టు సమాచారం.

అందువల్లే శాంతనుకు శ్రుతి హాసన్ బ్రేకప్ చేప్పిందని ఓ టాక్ వినిపిస్తుంది.

బ్రేకప్ తర్వాత శ్రుతి హాసన్ ఈ సారి డిప్రెషన్‌లోకి వెళ్లకుండా, ఎప్పటిలాగే ఎంజాయ్ చేస్తుంది.

తాను ఎంజాయ్ చేస్తున్న పిక్స్‌ను కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది.

ఇటీవల తన సిస్టర్ అక్షర హాసన్‌తో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది.

కాగా, శ్రుతి హాసన్‌కు ఇది రెండో బ్రేకప్ అని తెలిసిందే.