Vanitha Vijay Kumar: వనిత పై దాడి.. స్పందించిన బిగ్ బాస్ కంటెస్టెంట్..!

తాజాగా వనిత విజయ్ కుమార్.. తన ముఖంపై ఉన్న గాయాలను చూపిస్తూ తనపై దాడి చేశారు అంటూ ఒక పోస్ట్ షేర్ చేసిన విషయం తెలిసిందే. అసలు విషయంలోకి వెళ్తే తన కూతురు జోవికా ప్రస్తుతం తమిళంలో బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. అక్కడ ఈమె అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్ ఆంటోనీతో వైరం పెంచుకుంది. ఇక వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ప్రదీప్ ఆంటోనీ అభిమానులు వనిత విజయ్ కుమార్ పై దాడి చేసినట్లు సమాచారం. వనిత విజయ్ కుమార్ తన కూతురు జోవికాకు అండగా నిలుస్తూ ప్రదీప్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తుండగా ఆయన అభిమానులు ఈమెపై ఇలా దాడి చేసినట్లు సమాచారం.

ఇకపోతే తాజాగా తన ముఖానికి అయిన గాయాలను ఆమె చూపిస్తూ ఆటను కేవలం ఆటలాగే చూడాలి.. ఇలా శారీరకంగా హింసకు పాల్పడడం సమంజసం కాదు అంటూ కామెంట్లు చేసింది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన పోస్ట్ కి పలువురు నెటిజెన్లు మద్దతుగా నిలుస్తున్న నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ నుంచి రెడ్ కార్డ్ అందుకున్న ప్రదీప్ అంటోనీ తన ఎక్స్ ద్వారా తన అభిప్రాయాన్ని షేర్ చేస్తూ ఆమెకు క్షమాపణ తెలిపారు.

ఆయన వనిత విజయ్ కుమార్ తో చిట్ చాట్ చేసిన వాట్సాప్ మెసేజ్ ల స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు. నా కంటెస్టెంట్‌లలో ఎవరికీ వ్యతిరేకంగా నేను వ్యవహరించలేదు. నిజంగా నాకు ఏమీ తెలియదు నేను ఎవరితోనూ విరుద్ధంగా మాట్లాడలేదు. ముఖ్యంగా వనిత విజయ్ కుమార్ మీకు ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ నేను మీ పై జరిగిన దాడికి చింతిస్తున్నాను.. విశ్రాంతి తీసుకోండి.. జోవిక చాలా తెలివైనది.. ఆమె తనంతట తానుగా గెలవగలదు. ఆమెకు మీ సహాయం అవసరం లేదు అంటూ ప్రదీప్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

- Advertisement -

ఇక ప్రదీప్ అంటోనీ విషయానికి వస్తే ఇటీవల నటుడిగా మారిన ఈయన మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ను ప్రారంభించారు.ఆ తర్వాత కోలీవుడ్ లో ఎంతోమంది నటుల తో కలిసి పని చేసిన ఈయన తమిళనాడులోని చెన్నైలో పుట్టి పెరిగారు. విజువల్ కమ్యూనికేషన్ లో డిగ్రీ ని పొందిన ప్రదీప్ అంటోని స్క్రిప్ట్ రైటింగ్ , ఆర్ట్ డైరెక్షన్, కాన్సెప్ట్యులైజేషన్ విభాగాలలో అద్భుతమైన ప్రతిభ కలిగి ఉన్నారు. ఇతను అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే కాదు అంతకుమించి అద్భుతంగా పాటలు కూడా పాడగలరు. అంతేకాదు మంచి డాన్సర్ కూడా. వనిత విజయ్ కుమార్ పై జరిగిన దాడికి క్షమాపణలు కోరుతూ చేసిన పోస్ట్ పై నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు