Shivani Rajasekhar : నేను ఇంటికి పట్టిన దరిద్రాన్ని… నా వల్లే నాన్నకు అలాంటి పరిస్థితి

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి స్టార్ డాటర్ గా ఎంట్రీ ఇచ్చింది శివాని రాజశేఖర్. అయితే యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ తనయ శివాని రాజశేఖర్ కు ఆమె తండ్రి ఫాలోయింగ్ ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ కావడానికి నానా తంటాలు పడుతోంది ఈ బ్యూటీ. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ బ్యూటీకి హిట్ అనేది అందరిని ద్రాక్ష గానే మిగిలిపోయింది ఇప్పటిదాకా. కానీ తాజాగా ఆమె నటించిన “కోట బొమ్మాళి పిఎస్” అనే మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. శివాని ఖాతాలో ఈ మూవీతో మొదటి సక్సెస్ పడిందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో శివాని రాజశేఖర్ నేనే మా ఇంటికి పట్టిన దరిద్రాన్ని అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆ ఇంటర్వ్యూలో శివాని తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. గతంలో ఈ బ్యూటీ తన తండ్రితో కలిసి “శేఖర్” అనే సినిమా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కరోనా విజృంభిస్తున్న సమయంలో జరిగింది. దీంతో అప్పట్లో రాజశేఖర్ కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ విషయాలను గుర్తు చేసుకుని శివాని ఎమోషనల్ అయింది. సదరు ఇంటర్వ్యూలో శివాని మాట్లాడుతూ ‘శేఖర్’ సినిమాలో తన నాన్నతో కలిసి నటిస్తున్న సమయంలోనే తనకు కరోనా వచ్చిందని, దీంతో తన ఫ్యామిలీకి దూరంగా ఉన్నానని గుర్తు చేసుకుంది. కానీ అప్పటికే తన తండ్రికి కూడా కరోనా వచ్చిందని, దానికి కారణం తానేనని భావించిందట ఈ అమ్మడు. కానీ తన తండ్రి రాజశేఖర్ కు కరోనా వల్ల చాలా సీరియస్ అయ్యి వెంటిలేటర్ పై ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయంటూ గత పరిస్థితులను తలచుకొని కన్నీళ్లు పెట్టుకుంది.

తన తండ్రి కండిషన్ చాలా క్రిటికల్ గా మారడంతో ఆ సమయంలో తను చాలా కంగారు పడ్డానని శివాని తెలిపింది. తన తండ్రికి ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని టెన్షన్లో ఫ్యామిలీ అంతా ఉన్నామని, ఆయనను అలా చూసి తట్టుకోలేక అందరం ఏడ్చామని చెప్పుకొచ్చింది. ఆ సమయంలోనే బాగా ఆలోచిస్తే తన తండ్రికి అలాంటి పరిస్థితి రావడానికి తానే కారణం గనక “నేను మా ఇంటికి పట్టిన దరిద్రాన్నేమో”, అందుకే నాన్నకు ఇలా జరిగింది అని ఊహించుకొని బాగా ఏడ్చేసానని శివాని చెప్పుకొచ్చింది. అయితే అదృష్టవశాత్తు ఆయన కోలుకుని ఇంటికి రావడం సంతోషాన్ని కలిగించిందని శివాని వెల్లడించింది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు