Radha: కూతురు కోసం రాధా ఇచ్చిన కట్నం ఎంతో తెలిస్తే షాక్..!

ప్రముఖ సీనియర్ హీరోయిన్ అలనాటి అందాల తార రాధా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువగా చిరంజీవితో కలిసి నటించిన ఈమె 80 లలో అగ్రతార గా వెలిగింది. కొన్ని వందల చిత్రాలలో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రాధ ఆ తర్వాత కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ముఖ్యంగా తెలుగు, తమిళ్ అంటూ భాషతో సంబంధం లేకుండా మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న రాధా సెకండ్ ఇన్నింగ్స్ లో బుల్లితెరకు పరిమితం అయ్యిందని చెప్పాలి. ఇదిలా ఉండగా మొన్నటికి మొన్న తన పెద్ద కూతురు ప్రముఖ హీరోయిన్ కార్తీక పెళ్లి చేసిన విషయం తెలిసిందే. కార్తీక కూడా అందరికీ పరిచయమే. ఈమె నాగచైతన్య హీరోగా నటిస్తూ ఇండస్ట్రీకి పరిచయమైన మొదటి చిత్రం జోష్ ద్వారా కార్తీక కూడా తెలుగు తెరకు పరిచయమైంది.

అయితే ఈ సినిమా తో అంతగా గుర్తింపును అందివ్వలేదు. ఆ తర్వాత వచ్చిన రంగం సినిమాతో పేరు దక్కించుకుంది కార్తీక. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం రావడంతో ఈమె సినీ గ్రాఫ్ పెరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ తో నటించిన దమ్ము సినిమా డిజాస్టర్ కావడంతో కార్తీక కు సినిమా ఆఫర్లు కూడా తగ్గాయి. ఇక అలా తెలుగులో ఆఫర్లు రాకపోవడంతో తమిళ్ , కన్నడ , మలయాళం భాషల్లో బిజీ అవ్వాలనుకుంది కానీ అక్కడ కూడా ఈమె నటించిన సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఇక దీంతో తనకు సినిమా ఇండస్ట్రీ సెట్ కాదని బిజినెస్ ఉమెన్ గా స్థిరపడాలని తమ కుటుంబానికి ఉన్న రెస్టారెంట్ పనులు చూసుకోవడంలో బిజీ అయింది.

అలా రాధా కి ముంబై , చెన్నై అలాగే దుబాయ్ లో కూడా కొన్ని రెస్టారెంట్లు ఉండగా దుబాయ్ లో ఉన్న ఒక రెస్టారెంట్ బాధ్యతను కార్తిక తీసుకున్నట్లు సమాచారం. 2021 నుండి కార్తీక కి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు రాధా దంపతులు. అలా మలయాళ ఫ్యామిలీకి చెందిన యువ వ్యాపారవేత్త అయిన రోహిత్ మీనన్ తో సంబంధం రావడంతో అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటో మొత్తం తెలుసుకొని తన పెద్ద కూతురికి కేరళలోని ఒక రిసార్ట్లో చాలా గ్రాండ్గా వివాహం చేసింది. ఇక వీరి పెళ్లికి చిరంజీవితో పాటు ఎంతోమంది సినీ రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు.

- Advertisement -

ఇదిలా ఉండగా ఈ పెళ్లిలో కార్తీక వేసుకున్న నగలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇక ఈ క్రమంలోనే రాధా తన కూతురికి ఎంత కట్నం ఇచ్చింది అనే వార్తలు వైరల్ గా మారాయి. ఇకపోతే రూ.35 కోట్ల విలువ చేసే బంగారం తో పాటు దుబాయ్ లో కార్తీక చూసుకునే రెస్టారెంట్ ను కూడా ఆమెకే ఇచ్చేసిందట. అలాగే రూ.8 కోట్ల విలువ చేసే ఒక కారును అల్లుడికి కట్నం గా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు కార్తిక హీరోయిన్గా చేసిన సమయంలో ఆమెకు వచ్చిన రెమ్యునరేషన్తో కొన్ని ఆస్తులను కొనుగోలు చేయగా వాటిని కూడా కార్తీకాకే ఇచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా రాధా తన కూతురికి భారీగానే కట్నం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు