Rashmika in Animal: అయ్యో… అంత విప్పి చూపించినా అంతా వేస్ట్ అయ్యిందే !

“యానిమల్” మూవీ రిలీజ్ కావడం, రికార్డులను బద్దలు కొట్టడం ఒకదాని తర్వాత ఒకటి చాలా స్పీడ్ గా జరిగిపోయాయి. ఒకవైపు తెలంగాణ ఎలక్షన్స్ హిట్ ఉన్నప్పటికీ “యానిమల్” మూవీ తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు రాబట్టడం విశేషం. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మోస్ట్ వైలెంట్ మూవీలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక గతంలో ఎన్నడూ లేని విధంగా కనిపించి హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా సెమీ న్యూడ్ గా కనిపించి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

సౌత్ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా రష్మిక ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కొంత వరకు గ్లామర్ గా కనిపించినప్పటికీ ఇప్పుడు “యానిమల్”లో చేసినటువంటి సీన్లు తెలుగులో మాత్రం ఇప్పటిదాకా చేయనేలేదు. నిజానికి రష్మికకు స్టార్ హీరోయిన్ స్టేటస్ ను, లైఫ్ ని ఇచ్చింది టాలీవుడ్. అయితే టాలీవుడ్ లో ఉన్నన్ని రోజులు కండిషన్స్ అప్లై అంటూ గిరి గిసుకుని కూర్చున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కి వెళ్లేసరికి అంతా విప్పి చూపించడానికి సైతం రెడీ అయింది.

బెడ్రూమ్ సీన్స్, వరుస లిప్ లాక్ సీన్స్ అంటూ రెచ్చిపోయి హీట్ ఎక్కించింది. మొత్తానికి సెమీ న్యూడ్ గా నటించి మరోసారి సెన్సేషన్ గా మారింది. కానీ ఆమె అంతా విప్పి చూపించినప్పటికీ, అంతా వేస్ట్ అయిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది. దానికి కారణం లేకపోలేదు. సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్ననే అయినప్పటికీ, క్రెడిట్ మొత్తం ‘యానిమల్’ మూవీలో కీలకపాత్రలో నటించిన మరో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తికి దక్కింది. ఆమె నటించిన హాట్ సీన్స్ నెట్టింట్లో తుఫాన్ క్రియేట్ చేస్తున్నాయి. రష్మిక కంటే త్రిప్తికి ఎక్కువగా పాపులారిటీ దక్కుతోంది.

- Advertisement -

ఆమె ఎవరు అన్న విషయం గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు ప్రేక్షకులు. దీంతో అంతా విప్పి చూపించినప్పటికీ రష్మికకు ఉపయోగం లేకుండా పోయిందే అంటున్నారు సినీ విశ్లేషకులు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అందరి దృష్టి త్రిప్తిపైనే ఉంది. ఈ బ్యూటీకి టాలీవుడ్ లో సైతం ఆఫర్ల వెల్లువ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కనిపించింది ఒక్క షాట్ లోనే అయినా థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు త్రిప్తిని మర్చిపోలేకపోతున్నారు .దీంతో సినిమా ఇలా బ్లాక్ బస్టర్ హిట్ అయినా సంతోషం లేకుండా పోయింది రష్మికకు పాపం.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు