Family Star : మరో హీరోయిన్ తో విజయ్ దేవరకొండ మ్యారేజ్… మరి రష్మిక?

కెరీర్ మొదలుపెట్టిన అతి కొద్ది సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు విజయ్ దేవరకొండ. చేసింది తక్కువ సినిమాలే, అందులోనూ హిట్స్ కూడా తక్కువే. కానీ రోజురోజుకు పెరుగుతున్న ఆయన ఫాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఊహించని రీతిలో ఉంది. అలాగే ఎన్ని ప్లాపులు పడ్డా ఈ హీరో కెరియర్ పై దాని ఎఫెక్ట్ అస్సలు ఉండడం లేదు. క్రమంగా తన మార్కెట్ ను, అలాగే ఫాలోయింగ్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు విజయ్ దేవరకొండ. చాలాకాలం నుంచి సరైన హిట్ పడక ఇబ్బంది పడుతున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమాతో నైనా కచ్చితంగా ఫామ్ లోకి రావాలని పట్టుదలతో ఉన్నాడు.

మరోవైపు ఈ రౌడీ హీరో నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో రిలేషన్షిప్ లో ఉన్నాడు అనే రూమర్ సినీ పరిశ్రమలో రచ్చ చేస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ తన 13వ మూవీ “ఫ్యామిలీ స్టార్” షూటింగ్ ను స్టార్ట్ చేశాడు. గతంలో “గీత గోవిందం” వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్ కే మరోసారి దర్శకత్వ పగ్గాలు అప్పజెప్పాడు విజయ్ దేవరకొండ. మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేలా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తయిపోయింది.

వాస్తవానికి సంక్రాంతికి రిలీజ్ కావలసిన ఈ మూవీ సమ్మర్ కి వాయిదా పడుతున్నట్టు సమాచారం. ఇక ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో రష్మిక మందన్న కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీలో ఆమె ఊహించని పాత్రలో కనిపిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్ మూవీ, విజయ్ దేవరకొండ, రష్మికలకు సంబంధించిన ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది.

- Advertisement -

‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో రష్మిక మందన్న అసలు ఎలాంటి పాత్రలో కనిపించబోతోంది? ఎంతసేపు కనిపించబోతోంది ? అనే విషయాన్ని బయట పెడుతూ తాజాగా ఓ న్యూస్ లీక్ జరిగింది. ఈ చిత్రంలో రష్మిక ఒక పాటలో మాత్రమే కనిపిస్తుందట. అది కూడా విజయ్ దేవరకొండ, మృణాల్ మ్యారేజ్ సాంగ్ అట. వాళ్ల పెళ్లికి వచ్చిన గెస్ట్ లలో రష్మిక కూడా ఒకరు అన్నమాట. అయితే ఆ సన్నివేశం మాత్రం చాలా స్పెషల్ గా ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇది నిజంగా వీళ్ళిద్దరి ఫ్యాన్స్ కు ఒక మంచి సర్ప్రైజ్ అవుతుంది. ఇక సినిమాలో రష్మిక కూడా ఉంటుంది అనే వార్త బయటకు రావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు