Bandla Ganesh: ఎన్టీఆర్ తో గొడవలపై క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్..!

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈయన టెంపర్ సినిమా సమయంలో ఎన్టీఆర్ తో గొడవపడ్డారు అంటూ వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తూ ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేష్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన.. 2009లో రవితేజ హీరోగా నటించిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా కెరియర్ మొదలుపెట్టారు. ఇక తర్వాత రెండవ సినిమాని ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నే నిర్మించారు బండ్ల గణేష్. ఇక మూడో సినిమా గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు.

ఇక తర్వాత ఎన్టీఆర్ తో బాద్ షా ,అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడే వంటి సినిమాలు చేశారు బండ్ల గణేష్. ఇక చివరిగా ఎన్టీఆర్ తో టెంపర్ సినిమా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా విజయం సాధించింది కానీ ఈ సినిమా తర్వాత మళ్లీ ఎన్టీఆర్ తో సినిమా నిర్మించలేదు. ఇక ఈ సినిమా సమయంలో రచయిత వక్కంతం వంశీ పారితోషకం విషయంలో బండ్ల గణేష్ కోర్టు వరకు వెళ్లారు . అంతేకాదు ఈ గొడవ వల్లే అటు ఎన్టీఆర్ ఇటు బండ్ల గణేష్ మధ్య గ్యాప్ వచ్చిందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా దీనిపై బండ్ల గణేష్ మాట్లాడుతూ..నాకు , ఎన్టీఆర్ కి మధ్య ఎటువంటి విభేదాలు లేవు… టెంపర్ సినిమా తర్వాత కూడా నేను ఎన్టీఆర్ ను చాలా సార్లు కలిశాను అంటూ తెలిపారు బండ్ల గణేష్.. దీంతో ఇప్పటివరకు వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ వచ్చిన రూమర్లకు చెక్ పడిందని చెప్పవచ్చు.

గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ తో తనకు ఎలాంటి విభేదాలు ఉంటాయని బండ్ల గణేష్ ప్రశ్నించారు. అలాగే మళ్ళీ ఎన్టీఆర్ తో కలిసి చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. టెంపర్ సినిమా తర్వాత నిర్మాతగా తానే గ్యాప్ తీసుకోవాలని అనుకున్నానని.. అయితే మరీ ఇంత గ్యాప్ వస్తుందని తాను కూడా అనుకోలేదని తెలిపారు బండ్ల గణేష్. అయితే ప్రస్తుతం ఒకటి , రెండు ప్రాజెక్టుల గురించి చర్చలు జరుగుతున్నాయని.. హీరో , కథ ఫైనల్ అవ్వగానే ప్రకటిస్తానని బండ్ల గణేష్ తెలిపారు. అంతేకాదు తాను చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ హీరోతో ఉంటుందని కూడా స్పష్టం చేశారు.

- Advertisement -

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు