Biggboss season7: నాగార్జున స్వెటర్ ని అడిగిన అమర్ దీప్.! ఆ స్వెటర్ ఖరీదు ఎంతో తెలుసా?

బిగ్ బాస్ సీజన్ 7 లో ఆదివారం శోభా శెట్టి ఎలిమినేషన్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎలిమినేషన్ ముందు చాలా ఫన్ టాస్క్ లు జరిగాయి. ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవడం కంఫర్మ్ అని ముందే అనుకున్న అందరూ పెద్దగా టెన్షన్ పడకుండా సరదాగా గేమ్స్ ఆడడం జరిగింది. అయితే ఈ సీజన్లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన అమర్ దీప్ గురించి, అతని ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

స్టార్ మా సీరియల్ బ్యాచ్ నుండి హీరోగా వచ్చిన అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్ లో మాత్రం కమెడియన్ అయిపోయాడు. ఇతను టాస్క్ లు ఆడిన చాలా సార్లు అగ్రెస్సివ్ అయ్యి, ట్రోలర్స్ కి అడ్డంగా దొరికిపోయేవాడు. ఇక టాస్కులు ఒకటే కాదు నాగార్జున ముందు కూడా చాలాసార్లు హీరో అవుదామని అనుకుని కమెడియన్ అయ్యాడు. ఇలా చాలా సార్లు నాగార్జున ముందు ఫూల్ అయిన అమర్ దీప్, నిన్న ఆదివారం రోజు మాత్రం అమర్ దీప్ చేసిన చిన్న పిల్లల చేష్టలకి ఏమనాలో తెలియక సైలెంట్ అయ్యాడు.

ఇంతకీ అమర్ దీప్ చేసిందేంటంటే నాగార్జున వేసుకున్న స్వెటర్ ని అమర్ దీప్ తనకి కావాలని కోరుకున్నాడు. దానికి నాగార్జున అనాలనుకున్నా ఏమి అనలేదు. అయితే అమర్ దీప్ అడిగిన ఆ స్వెటర్ ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాలా 2 లక్షల 11 వేల రూపాయలు. ఇది తెలిసిన నెటిజెన్లు చిన్న పిల్లాడిలా అన్నీ అడగడమేనా అమర్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు