Naa Saami Ranga : తన సినిమాకు బిగ్ బాస్ ను వాడేస్తున్న నాగ్… టీజర్ లాంచ్ అక్కడే!

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన కొత్త సినిమా కోసం పాపులర్ బుల్లితెర షో “బిగ్ బాస్” వేదికను వాడుకుంటున్నాడు. తాను హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ వేదికపైనే తన లేటెస్ట్ మూవీ “నా సామిరంగ” మూవీని ప్రమోట్ చేసుకోబోతున్నాడు.

నాగార్జున హీరోగా నటిస్తున్న లేటెస్ట్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “నా సామి రంగ”. ఈ మూవీతో విజయ్ బిన్నీ టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. ఈ పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీలో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథన్ హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నేపథ్యం పచ్చని పల్లెటూరు కావడం, నాగార్జున, మరి నరేష్ ల మధ్య స్వచ్ఛమైన స్నేహం, ఇక ఎవర్గ్రీన్ మన్మధుడిగా టాలీవుడ్ లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న నాగార్జునకు కలిసి వచ్చి రొమాంటిక్ జోనర్ కూడా కావడంతో సినిమాపై సాధారణంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో ఇప్పటినుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్ర బృందం. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన “ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తోందే” సాంగ్, తాజాగా రిలీజ్ అయిన గ్లిమ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే “నా సామి రంగ” టీజర్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

నాగార్జున సినిమాలతో పాటు పాపులర్ బుల్లితెర షో బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో సినిమాలు బిగ్ బాస్ వేదికగా తమ సినిమాలను ప్రమోట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు స్వయంగా నాగార్జున తన కొత్త సినిమా “నా సామిరంగ” మూవీ టీజర్ ను బిగ్ బాస్ వేదికపై రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అయితే ఈ టీజర్ నాగార్జున చేతుల మీద కాకుండా ఆ షోకు గెస్ట్ గా వస్తున్న మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ కాబోతుండడం విశేషం. బిగ్ బాస్ ఫైనల్స్ వచ్చేవారం జరగబోతున్నాయి. ఫైనల్ విన్నర్ ఎవరో ఈ వారమే ప్రకటించబోతున్నారు. కన్నుల పండుగగా జరగబోతున్న బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ఫైనాన్స్ ల్స్ కు మహేష్ బాబు కూడా విచ్చేస్తుండడం, అదే వేదికపై నాగార్జున “నా సామి రంగ” మూవీ టీజర్ రిలీజ్ చేస్తాడు అంటూ వస్తున్న వార్తలు బుల్లితెర ప్రేక్షకుల ఆత్రుతను పెంచేస్తున్నాయి. ఇక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మహేష్ బాబు హీరోగా నటిస్తున్న “గుంటూరు కారం” మూవీ కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. అంటే ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్నారు. అయినప్పటికీ ఒకరి సినిమాకు సంబంధించిన టీజర్ ను మరొకరు రిలీజ్ చేస్తున్నడం మంచి విషయం. ఈ హెల్తీ కాంపిటీషన్ టాలీవుడ్ ను ఎప్పటికీ హెల్దీగా ఉంచుతుంది అనడంలో సందేహం లేదు.

- Advertisement -

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు