Chandrasekhar: ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్.. కారణం తెలిస్తే షాక్..!

సోషల్ మీడియా వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు కూడా సెలబ్రిటీ లాగా మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఇలా వచ్చిన పాపులారిటీతోనే పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటున్న ఆర్టిస్టులను కూడా మనం చూస్తూనే ఉన్నాము.. చాలామంది హీరోలుగా , హీరోయిన్స్ గా పలు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. అలా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న వారు అనుకోకుండా కొన్ని వివాదాలలో చిక్కుకుంటే ఇట్టే వైరల్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవలే పుష్ప సినిమాలోని ఒక నటుడు లైంగిక వేధింపుల కేసులు చిక్కుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొక తెలుగు యాక్టర్ , యూట్యూబ్ ఆర్టిస్టు కూడా అరెస్టు అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి చూద్దాం.

 

ప్రముఖ యూట్యూబర్ గా పేరు సంపాదించిన చంద్రశేఖర్ సాయికిరణ్ పలు సినిమాలలో నటించడమే కాకుండా పలు రకాల షార్ట్ ఫిలిం లను కూడా తెరకెక్కిస్తూ మంచి పాపులారిటీ అందుకున్నారు.. ఇటీవలే ఈ నటుడుని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఒక యువతి.. చంద్రశేఖర్ తనని అత్యాచారం చేసి మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది . దీంతో నార్సింగి పోలీసులు చంద్రశేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

చంద్రశేఖర్ 2021 ఏప్రిల్ 25న తన పుట్టినరోజు వేడుకలకు సైతం ఒక యువతిని పిలిపించి ఆమె పైన లైంగిక దాడికి పాల్పడ్డారని చంద్రశేఖర్ పైన ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఈ నిందితుడు పైన 420,376(2)..SC,ST అట్రాసిటీ కింద కేసు నమోదు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి దీంతో చంద్రశేఖర్ తో పాటు ఆయన తల్లిదండ్రులను అలాగే మరో ఇద్దరి పైన ఈ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తున్నది.

నటుడు యూట్యూబర్ చంద్రశేఖర్ ను మాత్రం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లుగా సమాచారం.. చంద్రశేఖర్ చందు గాడు, పక్కింటి కుర్రాడు అనే యూట్యూబ్ ఛానల్స్ లో పలు రకాల వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించారు. ఇలాంటి పాపులారిటీతోనే చంద్రశేఖర్ సాయికిరణ్ కొన్ని సినిమాలలో నటించి మరింత ప్రేక్షకాదరణ పొందారు. చంద్రశేఖర్ ఎప్పుడు కూడా ఏదో ఒక సందేశం ఇచ్చేటువంటి వీడియోలను పోస్ట్ షేర్ చేస్తూ ఉండేవారు. కానీ ఇలా తన పైన అత్యాచారం కేసు రావడంతో పలువురు అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు. మరి చివరికి ఈ కేస్ ఎంతవరకు వెళుతుందో చూడాలి మరి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు