OSCAR: “నాటు నాటు” పాటకు ఆస్కార్

తెలుగు పాట చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ చిత్రంలోని “నాటు నాటు” పాటకి ఆస్కార్ అవార్డు దక్కింది. నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరి లో అవార్డు సాధించింది. అమెరికా లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో అట్టహాసంగా జరుగుతుంది ఆస్కార్ సంబరం. 95వ అకాడమీ అవార్డుల పండుగకు ప్రపంచ దిగ్గజ నటీనటులు హాజరయ్యారు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, సెంథిల్ కుమార్, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ మాస్టర్.. లతో పాటు ఉపాసన, రాజమౌళి తనయుడు కార్తికేయ, మరికొంతమంది ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.

ఈరోజు ఉదయం 5:30 గంటలకు మొదలైన ఈవెంట్ మన తెలుగు సాంగ్ “నాటు నాటు”తో ప్రారంభం అయింది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ దక్కించుకోవడం ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించినట్లైంది. కీరవాణి స్వరపరిచిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించిన సంగతి తెలిసిందే. చంద్రబోస్ రాసిన ఈ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సైతం దక్కించుకుంది. నాటు నాటుకు సంగీతం అందించిన కీరవాణి ఆస్కార్ ప్రతిమ అందుకున్నారు. దేశం మొత్తం ఈ పాటకి అవార్డు రావాలని కోరుకుంది. అనుకున్నట్లే, ఇప్పుడు అదే జరిగింది. కోట్లాది ప్రజల ఆశ, ఆకాంక్ష నెరవేరింది. ఇక ఇదే ఆస్కార్ కార్యక్రమంలో మరో ఇండియన్ డాక్యుమెంటరీ కి ఆస్కార్ దక్కింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం గా ” ది ఎలిఫెంట్ విస్పరర్స్” ఆస్కార్ ను గెలుచుకుంది.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు