Pooja Hegde: ఎమోషనల్ ట్వీట్

ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే దంపతులకు 1990 అక్టోబర్ 13న జన్మించింది పూజ. వీరి స్వస్థలం కర్ణాటక కాగా పూజ ముంబైలో పుట్టి పెరిగింది. ఈమెకి ఒక సోదరుడు కూడా ఉన్నాడు.

కాగా పూజ హెగ్డే సోదరుడు రిషబ్ హెగ్డే వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. శివాని శెట్టి అనే మహిళను ఆయన వివాహమాడారు. ఈ పెళ్లికి సంబంధించి అన్నీ తానై చూసుకుంది బుట్ట బొమ్మ పూజా హెగ్డే. వారం రోజులపాటు ఆ పెళ్లి వేడుకలో మునిగి తేలింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ రిషబ్ హెడ్డే పెళ్లి ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.

ఈ సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా చేసింది. ఎప్పుడూ లేనంత సంతోషాన్ని ఈ పెళ్లితో పొందానంటూ ఎమోషనల్ అయింది. “నా సోదరుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుక ప్రారంభం నుంచి నేను ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నాను. చిన్నపిల్లలా నవ్వేశా. ఆనంద భాష్పాలు వచ్చాయి” అంటూ ఎమోషనల్ అయింది పూజ.

- Advertisement -

దీంతో కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సినీ తారలు, నేటిజెన్లు, అభిమానులు. ఇక ప్రస్తుతం పూజ తెలుగులో మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతోంది. మరోవైపు బాలీవుడ్ లో సల్మాన్ తో ఓ చిత్రంలో నటిస్తోంది.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు