ఎన్టీఆర్- కొరటాల సినిమాకి రూ.150 కోట్లా?

పాన్ ఇండియా పై ఉన్న మోజుతో టాలీవుడ్ నిర్మాతలు రూ.100 కోట్లు రూ.150 కోట్లు రూ.200 కోట్లు బడ్జెట్ అంటే చాలా ఈజీగా లెక్కేసుకుంటున్నారు. స్టార్ హీరో ఉంటే ఏదో ఒకరకంగా ఆ మూవీ తిరిగి వచ్చేస్తుంది అనేది వారి ధీమా. సినిమా టీజర్ మొదలైనప్పటి నుండే హైప్ తీసుకొచ్చి నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో 70 శాతం రికవర్ చేసుకోవచ్చు అని వారు భవిస్తూ ఉంటారు. దర్శకుడి ట్రాక్ రికార్డ్ ను కూడా పక్కన పెట్టేసి ఈ విషయంలో వాళ్ళు వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా కొరటాల- ఎన్టీఆర్ కాంబో గురించి చెప్పుకోవచ్చు. గతంలో వీరి కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ మూవీ వచ్చింది. టాక్ తో సంబంధం లేకుండా ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.

ఇప్పుడు వీరి కాంబినేషన్లో రెండో మూవీ రాబోతుంది. కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రానికి నిర్మాత. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకి రూ.150 కోట్లు బడ్జెట్ ను ఫిక్స్ చేశారట. ‘ఆచార్య’ ప్లాప్ అయినా ‘ఆర్.ఆర్.ఆర్’ తో ఎన్టీఆర్ కు పాన్ ఇండియా మార్కెట్ వచ్చింది అనేది వారి ధీమా. పైగా రూ.150 కోట్ల బడ్జెట్ అంటే స్టార్ హీరో సినిమాకి చాలా తక్కువ అన్నట్టు అనుకుంటున్నారు. ‘మిర్చి’ ని మించి తీసే కమర్షియల్ మూవీ ఇదని కొరటాల పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అందుకేనేమో..!

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు