Geethika : యంగ్ బ్యూటీకి బంపర్ ఆఫర్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వం లో మహేష్ నటించిన అతడు, ఖలేజా రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో మూడు సినిమా వస్తుంది. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను కూడా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

పూజా హెగ్డే తో పాటు ప్రియాంక అరుల్ మోహన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా పై అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి అనేక వార్తలు సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తేజ దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ హీరోగా లాంచ్ అవుతూ ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా అహింస. లవ్ మరియు యాక్షన్ ఎంటర్టైన్ గా ఈ సినిమా వస్తోంది. ఈ మూవీలో గీతిక అనే హీరోయిన్.. అభిరామ్ తో స్టెప్పులు వేయనుంది. ఇది ఇలా ఉండగా, ఈ గీతిక అనే అమ్మాయి త్రివిక్రమ్- మహేష్ బాబు సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుందట.

- Advertisement -

తెలుగులో చేసిన ఒక సినిమాకే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ దక్కుంచుకున్న గీతికకు మరో రెండు సినిమాల్లో కూడా ఛాన్స్ లభించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ బజ్ లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే, వీటికి సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు