NTR31 : ఇది నిజమైతే బాక్సాఫీస్ షేక్..

టాలీవుడ్ స్టార్ హీరోలు చిన్న సినిమాలకు చాలా దూరంగా ఉంటున్నారు. నిర్మాతలు ముందుకు రావడంతో.. భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ పాన్ ఇండియా స్థాయిలో పెరిగింది. దీంతో తారక్ తో పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం సైన్ చేసిన NTR30, NTR31 సినిమాలు భారీ బడ్జెట్ తో వస్తున్న పాన్ ఇండియా సినిమాలే.

ఇందులో NTR30 ని టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే జనవరి రెండో వారంలో గానీ, మూడో వారంలో గానీ ప్రారంభం కాబోతుంది. ఇదిలా ఉండగా, NTR31 ని కేజీఎఫ్ తో సినిమా ప్రపంచాన్ని షేక్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. దీని తర్వాత కేజీఎఫ్3, NTR31 షూటింగ్ లను స్టార్ట్ చేయనున్నాడు.

అయితే NTR31 గురించి ఇటు టాలీవుడ్ లో, అటు బాలీవుడ్ లో ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే.. NTR31 లో ఒక స్కోప్ ఉన్న పాత్ర ఉంటుందట. ఆ పాత్రలో బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ ను తీసుకోవాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అమీర్ ఖాన్ అంగీకరిస్తే.. ఆ పాత్ర నిడివిని పెంచడానికి కూడా ప్రశాంత్ నీల్ సిద్ధంగా ఉన్నాడని టాక్.

- Advertisement -

దీనిపై అమీర్ ఖన్ తో త్వరలోనే చర్చలు జరగే అవకాశాలు ఉన్నాయని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ NTR31లో తారక్ తో పాటు అమీర్ ఖాన్ నటిస్తే పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమని చెప్పొచ్చు. మరీ అమీర్ ఖాన్ ఈ సినిమా గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు