Amir : నిర్మాతల కోసం త్యాగం

బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ “లాల్ సింగ్ చడ్డా”. అమీర్ ఖాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అలాగే భారీ హైప్ కూడా వచ్చింది. అయితే ఇటీవలే విడుదలైన ఈ చిత్రం భారీ నష్టాలను చవిచూసింది. హాలీవుడ్ సూపర్ హిట్ ఫారెస్ట్ గంప్ చిత్రానికి అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీని, దాదాపు నాలుగేళ్లపాటు కష్టపడి తెరకెక్కించారు. కానీ బాయ్ కాట్ సెగతో వసూళ్ల పరంగా దారుణంగా విఫలమైంది. దీంతో నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి.

అయితే ఈ సినిమా నష్టాన్ని భర్తీ చేసేందుకు అమీర్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా నష్టాన్ని తగ్గించడానికి తన పారితోషకాన్ని పూర్తిగా వదులుకోవడానికి రెడీ అయ్యాడు. లాల్ సింగ్ చడ్డా బడ్జెట్ రూ. 180 కోట్లు కాగా.. ఆమీర్ తో పాటు అతని మాజీ భార్య కిరణ్ రావ్ ఈ సినిమాకు సహానిర్మాతలుగా ఉన్నారు. ఈ సినిమాకు అమీర్ రెమ్యూనరేషన్ 50 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని వదులుకొని నిర్మాతలకు నష్టాన్ని తగ్గించాలనుకుంటున్నారట.

ఆగస్టు 11న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు కనీసం వంద కోట్లు రాబట్టలేకపోయిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. నిర్మాతలకు ఈ సినిమా వల్ల దాదాపు 90 నుంచి 100 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా అమీర్ ఖాన్ తీసుకున్న నిర్ణయం వల్ల, నిర్మాతలకు నష్ట శాతం కొంత మేర తగ్గనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు