Agent : పోటీని తట్టుకోలేక..

అక్కినేని అఖిల్ ఎన్నో ఏళ్లుగా కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. గతేడాది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తో హిట్టు సాధించినా.. కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయాడు. ప్రస్తుతం ఈయన ఆశలన్నీ ‘ఏజెంట్’ సినిమా పైనే ఉన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో రా ఏజెంట్ గా అఖిల్ కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి.

మలయాళ స్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో కలిసి సురేందర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. అఖిల్ కు జోడిగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. అయితే సినిమాకు సంబంధించిన విడుదల తేదీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారని ఇటీవల కొన్ని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సంక్రాంతికి పోటీ తీవ్రత ఎక్కువ కావడంతో థియేటర్లు కూడా దొరకడం కష్టమవుతుంది అని నిర్మాతలు, దర్శకులు మళ్లీ యూటర్న్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ చిత్రం ఫిబ్రవరి 2023 కి వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా మేకర్స్ నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు