AK62 : తెరపైకి మరో హీరోయిన్ పేరు

తునీవు (తెలుగులో తెగింపు) తో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ సంక్రాంతి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. 200 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల మార్క్ ను అందుకుంది. తమిళంతో పాటు ఓవర్సీస్ లో సినిమాకు మంచి టాక్ రావడంతో బ్రేక్ ఈవెన్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని తెలుస్తుంది. కాగా, తునీవు తర్వాత విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో అజిత్ కుమార్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

AK62 అనే వర్కింగ్ టైటిల్ తో ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. అయితే దీనిలో హీరోయిన్ పాత్ర గురించి గత కొన్ని రోజులగా అనేక వార్తలు వస్తున్నాయి. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను ఎంపిక చేశారని టాక్ వచ్చింది. దీని తర్వాత త్రిష స్థానాన్ని కాజల్ అగర్వాల్ కొట్టేసిందని కూడా వార్తలు వచ్చాయి. మళ్లీ కొన్ని రోజులకు లేడీ సూపర్ స్టార్ నయనతార ఫైనల్ అయినట్టు టాక్ వినిపించింది.

తాజాగా AK62లో మరో హీరోయిన్ ఫిక్స్ అయిందనే వార్తలు కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ Ak62లో నటిస్తుందట. అయితే తాజాగా వస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా కథకు అనుకూలంగా ఇద్దరు హీరోయిన్స్ ఉండబోతున్నారట. అందులో ఒక హీరోయిన్ గా నయనతార, మరో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ ఉండబోతున్నారని టాక్. అయితే ఇందులో నయనతార డ్యూయల్ రోల్ చేస్తుందని వినిపిస్తోంది. కాగా దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -

కాగా ఐశ్వర్య రాయ్, అజిత్ కుమార్ కాంబినేషన్ లో ఇప్పటికే ఒక సినిమా వచ్చింది. 2000 సంవత్సరంలో వీరి కాంబోలో కండుకొండైన్ కండుకొండైన్ అనే సినిమా వచ్చింది. మళ్లీ 22 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు