Balakrishna : యాంక‌ర్ స్టెప్పులు

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన అఖండ సినిమా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అస‌వ‌ర‌మే లేదు. అఖండ విజ‌యం త‌రువాత బాల‌కృష్ణ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం NBK 107 చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రానికి గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అఖండ సినిమాలో బాల‌య్య‌ను చూపించిన దానికంటే ఇందులో ప‌వ‌ర్‌ఫుల్‌గా చూపించ‌బోతున్నార‌ట గోపిచంద్ మ‌లినేని. ఇటీవ‌లే క్రాక్ సినిమాతో హిట్ అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ బాల‌య్య కోసం అదిరిపోయే క‌థ‌ను సిద్ధం చేశాడ‌ట‌.

ఈ చిత్రంలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా పోస్ట‌ర్లు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఈ సినిమాలో బాల‌య్య రెండు డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ చిత్రం త‌రువాత అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నారు.

ఇటీవ‌లే ఎఫ్‌3 సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్న అనీల్ బాల‌కృష్ణ కోసం ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌ను సిద్ధం చేస్తున్నార‌ట‌. ఈ చిత్రంలో బాల‌కృష్ణ వ‌య‌స్సు మ‌ల్లిన పాత్ర‌లో అదేవిధంగా యువ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. యాక్ష‌న్ తో పాటు అనిల్ స్టైల్ కామెడీ కూడా ఉండ‌నున్న‌ద‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్ కోసం అందాల భామ అన‌సూయ‌ను అనుకుంటున్నార‌ట‌. ఇప్ప‌టికే యాంక‌ర్‌గా చేస్తూనే ప‌లు సినిమాల్లో న‌టించింది అన‌సూయ‌. అదేవిధంగా ప‌లు స్పెష‌ల్ సాంగ్ ల్లో కూడా ఆక‌ట్టుకుంటుంది. ఇప్పుడు బాల‌య్య‌తో క‌లిసి స్టెప్పులేయ‌నుంద‌ని అంటున్నారు. వాస్త‌వం ఎంతో అనేది వేచి చూడాలి మ‌రి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు