NTR : తారక్ కు కుదురుతుందా..?

ఎన్టీఆర్.. టాలీవుడ్ లో టాప్ హీరోల్లో మొదటి వరుసలో ఉండే హీరో. టెంపర్ సినిమా తర్వాత తారక్ కెరీర్ వరుస హిట్లతో దూసుకెళ్లింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ఫర్మామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి డైరెక్టర్లు క్యూ కడుతున్నారు.

ఇప్పటికే తారక్, కొరటాల శివ, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయనున్నాడు. దీని అధికారిక ప్రకటన లేకున్నా, పలు వేదికలపై ఎన్టీఆర్ స్వయంగా అనౌన్స్ చేశాడు. అలాగే “ఉప్పెన” డైరెక్టర్ బుచ్చిబాబుతో కూడా సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

తాజాగా మరో యంగ్ డైరెక్టర్ కూడా తారక్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడట. అందుకోసం ఓ స్టోరీ ని రాసే పనిలో ఉన్నాడట. ఆయనే ఎవరో కాదు.. సూపర్ స్టార్ మహేష్ కు సరిలేరు నీకెవ్వరు హిట్ అందించిన అనిల్ రావిపూడి. ఆయన ప్రస్తుతం “ఎఫ్2” మూవీకి సీక్వెల్ గా తెరకెక్కించిన “ఎఫ్ 3” ప్రమోషన్స్ బిజీ లో ఉన్నారు. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన తర్వాత ప్రాజెక్ట్ ల గురించి వివరించాడు. ముందుగా బాలయ్యతో సినిమా చేస్తున్నట్లు, తర్వాత తారక్ తో కూడా చేసే అవకాశాలున్నాయని వెల్లడించాడు.

- Advertisement -

ఆయనతో టచ్ లో ఉన్నానని, స్టోరీ గురించి చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నాడు. అయితే ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందంటే.. అది మాత్రం క్లారిటీ ఇవ్వలేమని దాటేశారు. కెరీర్ అయిపోయింది అనుకునే టైంలో కళ్యాణ్ రామ్ కు “పటాస్” వంటి హిట్ సినిమాను ఇచ్చి దర్శకుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు అనిల్.

అయితే ఇప్పటికే మూడు సినిమాలతో బిజీ గా ఉన్న తారక్, అనిల్ రావిపూడితో సినిమా చేస్తారా..? చేస్తే, తారక్ కోసం అనిల్ ఎలాంటి స్టోరీ రెడీ చేస్తాడని నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు