Anjali: పెళ్లికి సిద్ధమైన నటి .. వరుడు ఎవరంటే..?

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో అంజలి కూడా ఒకరు. ఆంధ్ర ప్రదేశ్ లోని రాజోల్ కు చెందిన అంజలి.. ఫోటో అనే చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. దీని తర్వాత తమిళ ఇండస్ట్రీపైనే ఫోకస్ పెట్టి, అక్కడే వరుసగా సినిమాలు చేసింది. సీతమ్మ వాకిట్లో సిరమల్లే చెట్టుతో మళ్లీ తెలుగు తెరపైకి వచ్చిన తర్వాత, టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వచ్చాయి.

ప్రస్తుతం అంజలి సినిమాలతో పాటు ఓటీటీల్లో వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. ఇటీవల అంజలి నుంచి ఝాన్సీ, ఫాల్ అనే వెబ్ సిరీస్ లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అంజలి గురించి టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతుంది. తెలుగింటి అమ్మాయి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందట. తల్లిదండ్రులు కుదర్చిన సంబంధానికి అంజలి ఓకే చేసిందని టాక్ వినిపిస్తోంది. అయితే అంజలి పెళ్లి గురించి వార్తలు రావడం ఇదేమీ కొత్తేమీ కాదు.

గతంలో అంజలి ఓ బిజినెస్ మ్యాన్ తో ప్రేమలో ఉందని, త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోబోతుందని ఓ సారి వార్తలు వచ్చాయి. అలాగే ఓ నటుడితో కూడా ప్రేమాయణం సాగిస్తుందని కూడా రూమర్స్ వచ్చాయి. కానీ, తాజాగా వస్తున్న వార్తల్లో నిజం ఉందని తెలుస్తోంది. అంజలి తల్లిదండ్రులు అమెరికాలో ఉంటున్నారట. త్వరలోనే వారు వచ్చిన తర్వాత పెళ్లి డేట్ ను పిక్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -

కాగా, అంజలి ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఆర్సీ 15లో కీలక పాత్ర చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయి, విడుదలైన తర్వాత పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో అంజలి ఉన్నట్టు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇప్పటి వరకు వచ్చిన పెళ్లి వార్తలా.. ఇది కూడా రూమర్ గా మిగిలిపోతుందా.. లేదా అంజలి ఈసారి నిజంగానే పెళ్లి చేసుకుంటుందా అనేది చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు