Unstoppable : పవన్ తో పాటు మరో మెగా హీరో?

అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె.. ఆహా లో ప్రసారం అవుతున్న ఈ షో హైప్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో యొక్క సెకండ్ సీజన్ నుండి వచ్చిన ఎపిసోడ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ షోలో పాల్గొనడంతో గత రెండు వారాలుగా ఈ షో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంది. ప్రభాస్ ఎపిసోడ్ డిసెంబర్ 31 స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా .. అన్ స్టాపబుల్ షో లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారనే టాక్ గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ ఎపిసోడ్ ఎప్పుడు చేయబోతున్నారనేది క్లారిటీ లేదు.తాజాగా ఈ ఎపిసోడ్ షూట్ ఎప్పుడు చేయబోతున్నారనేది క్లారిటీ వచ్చేసింది. ఈ ఎపిసోడ్ ని ఈ నెల 27వ తేదీన (నేడు) షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది.

ఈ ఎపిసోడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు దర్శకుడు క్రిష్ కూడా గెస్టుగా రాబోతున్నారు. హరిహర వీరమల్లు సినిమాకు బ్రేక్ ఇచ్చి మరి బాలయ్య షోలో పాల్గొంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు క్రిష్. అయితే ఈ షోలో ఫోన్ కాల్ ద్వారా మరో మెగా హీరో కొద్దిసేపు పాల్గొనబోతున్నారట. ఆయన ఎవరో కాదు యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. ఈ తాజా అప్డేట్ తో పవన్ అభిమానులు ఫుల్ ఖుషి లో ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు