Aishwarya Lekshmi: నేను ఆ హీరోని ప్రేమించట్లేదు.

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న హీరోయిన్లలో మలయాళ కుట్టి ఐశ్వర్యలక్ష్మి ఒకరు. అమ్ము, పొన్నియన్ సెల్వన్, మట్టి కుస్తీ, గార్గి వంటి చిత్రాలలో నటించి మెప్పించింది ఈ మలయాల ముద్దుగుమ్మ. తాజాగా ఈమె నటుడు అర్జున్ దాస్ తో ప్రేమలో పడినట్లు తన ఇంస్టాగ్రామ్  ద్వారా వెల్లడించింది. అంతేకాదు అర్జున్ దాస్ తో కలిసి దిగిన ఓ ఫోటోని కూడా షేర్ చేసి, దానికి లవ్ సింబల్ ని జోడించింది.

అయితే ఇది చూసిన కొందరు ఫ్యాన్స్ ఆమెకి కంగ్రాట్స్ చెబుతుంటే.. మరికొందరు మాత్రం ఇది ప్రమోషన్స్ స్టంట్ అయి ఉండొచ్చని అంటున్నారు. వీరిద్దరూ కలిసి త్వరలో ఏదైనా కొత్త సినిమాలో నటిస్తున్నారేమోనని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా? లేదా? అనే సందేహం మొదలైంది.

అయితే ఇటీవల మట్టి కుస్తీ సినిమా ప్రమోషన్స్ టైం లో ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య లక్ష్మికి మీరు ప్రేమ వివాహం చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె అసలు పెళ్లి మీదే ఇంట్రెస్ట్ లేదని బదులిచ్చింది. కానీ ఇప్పుడు సడన్ గా ఈ పోస్ట్ చూసి నెటిజెన్లు కన్ఫ్యూజన్లో పడ్డారు. ఇక అర్జున్ దాస్ విషయానికి వస్తే.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించిన ఈ నటుడు మాస్టర్ సినిమాతో మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఇప్పుడు బుట్ట బొమ్మ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు అర్జున్ దాస్.

- Advertisement -

ఇది ఇలా ఉండగా, మరుసటి రోజు తన పోస్ట్ కి వచ్చిన కామెంట్లకు, మెసేజీలకు స్పందిస్తూ, ”మేము సరదాగా కలిసాము, ఒక ఫోటో దిగాము, దానిని నేను పోస్ట్ చేశాను, మేము మంచి స్నేహితులం మాత్రమే, ఈ పోస్ట్ ఇలా అర్ధం అవుతుంది అని ఊహించలేదు.” అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా క్లారిటీ ఇచ్చింది ఐశ్వర్య లక్ష్మి.

For More Updates : 

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

 

 

 

 

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు