RC15 : మరో స్టార్ నటి

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో RC15 ఒకటి. ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికి తోడు సెన్సెషనల్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించడంతో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో 2.0, నన్ బన్ వంటి సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. ఇప్పుడు RC15 కూడా అంతటి హిట్ అవుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

కాగా RC15 సినిమా షూటింగ్ చాలా వరకు జరుపుకుంది. శంకర్ మధ్య లో ఇండియన్ -2 కు వెళ్లడంతో షూటింగ్ కు కొంత వరకు బ్రేక్ పడింది. ప్రస్తుతం RC15కి శంకర్ తిరిగివచ్చాడు. ఇప్పుడు కొత్త షెడ్యూల్ కు RC15 రెడీ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. సినిమాలో సీనియర్ నటి ఖుష్బూ కీలక పాత్ర చేయబోతుందట. సినిమాను మలుపు తిప్పే ఎపిసోడ్ లో ఈ స్టార్ నటి కనిపిస్తుందని టాక్ వినిపిస్తుంది.

కొత్త షెడ్యూల్ షూటింగ్ లో ఖుష్బూ పై పలు సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనిపై మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, కొత్త షెడ్యూల్ సెట్స్ పై ఖుష్బూ కనిపిస్తుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు