Waltair Veerayya : మరో సర్ప్రైజ్ రోల్

గాడ్ ఫాదర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కేఎస్ రవీంద్ర (బాబి) దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే ఓ పవర్ ఫుల్ మూవీ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాని విశాఖ నేపథ్యంలో జాలరుల జీవితాలకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కోన వెంకట్, చక్రవర్తి స్క్రీన్ ప్లే సమకూర్చిన ఈ సినిమాకి హరి మోహన్ కృష్ణ, వినీత్ పొట్లూరి రచన సహకారం అందిస్తున్నారు.

దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ సినిమాలోంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ తాజా అప్డేట్ ఏమిటంటే.. ఈ మూవీ సెకండ్ హాఫ్ లో ఓ ఎస్.ఐ పాత్ర ఎంట్రీ ఇస్తుందని.. మూవీలో ఈ పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ సినిమాలోనే కీలకం కానున్నట్లు తెలుస్తోంది.

ఈ పాత్ర విలన్ చేతిలో హత్య కాబడే ఎమోషనల్ పాత్రగా తెలుస్తోంది. అయితే ఈ పాత్రలో యంగ్ హీరో కార్తికేయ కనిపించబోతున్నాడనే టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ పాత్ర గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు కూడా ప్రకటించింది చిత్ర బృందం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు