Anupama Parameswaran : గోల్డెన్ టైం

టాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ హవా నడుస్తోంది. సీనియర్ హీరోయిన్స్ ఎన్ని సినిమాలు చేసిన రాని క్రేజ్ యంగ్ హీరోయిన్స్ కు ఒక్క సినిమాతోనే వచ్చేస్తోంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రేక్షకులతో పాటు దర్శక నిర్మాతల చూపులు ఇద్దరు యంగ్ బ్యూటీస్ పైనే ఉన్నాయి. వాళ్లే కృతి శెట్టి, శ్రీలీల. ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. పెళ్లి సందDతో పరిచయమైన శ్రీలీల కు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు.

వీరి కోసం దర్శక నిర్మాతలు క్యూలో ఉంటున్నారు. ఇలాంటి సమయంలో యంగ్ హీరోయిన్స్ కు అనుపమ పరమేశ్వరన్ గట్టి పోటీ ఇస్తుంది. అనుపమ ఇటీవల నటించిన కార్తికేయ2, 18 పేజెస్ సూపర్ హిట్ అయ్యాయి. 18 పేజెస్ లో అనుపమ క్యారెక్టర్ కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఈ సినిమాలో అందం, అభినయనికి యూత్ ఫిదా అవుతున్నారు. తాజాగా అనుపమ నటించిన బట్టర్ ఫ్లై డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకి కూడా మంచి టాక్ వస్తోంది.

నిజానికి అనుపమ కొన్ని రోజుల క్రితం తన కెరీర్ లో గడ్డు పరిస్థితులను అనుభవించింది. చాలా రోజులు మంచి హిట్ కోసం ఎదురుచూసింది. ఒక స్టేజ్ లో అనుపమ సినీ కెరీర్ ముగిసింది అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు వాటన్నింటినీ ఎదుర్కొంటూ వరుసగా రెండు హిట్స్ కొట్టడమే కాకుండా బట్టర్ ఫ్లైతో ఓటీటీలో కూడా ఆకట్టుకుంది. దీంతో అనుపమకు ఇండస్ట్రీలో డిమాండ్ కూడా పెరిగింది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు ఈ సమయాన్ని అనుపమ ఉపయోగించుకుంటుంది.

- Advertisement -

తాజాగా అనుపమ తన రెమ్యునరేషన్ ను పెంచినట్టు టాక్. ఇప్పటి వరకు ఒక్కో సినిమాకు 60 లక్షలు తీసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోటి రూపాయల నుంచి 1.20 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందని సమాచారం. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి మంచి ఆదరణ కూడా ఉండటంతో నిర్మాతలు కూడా అనుపమ కోరిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు