Anasuya: మొత్తానికి అనసూయ దిగొచ్చింది, కాంప్రమైజ్ అయ్యిందా – భయపడిందా…?

జబర్దస్త్ యాంకర్ అనసూయ, రౌడీ హీరో విజయ్ దేవరకొండ మధ్య ఉన్న వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో మొదలైన ఈ వివాదం కారణంగా తరచూ విజయ్ ఫ్యాన్స్ అనసూయని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తరచూ ట్రోల్స్ చేస్తున్నారు. అనసూయ కూడా ఏ మాత్రం తగ్గకుండా ఆ ట్రోల్స్ ఎప్పటికప్పుడు గట్టిగ సమాధానం ఇస్తూ వస్తోంది. ఇటీవల విజయ్ దేవరకొండ ఖుషి సినిమా కోసం ‘ది’ ట్యాగ్ ని వాడుకోవటంపై అనసూయ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో, ఈ వివాదానికి ఇప్పుడప్పుడే ఎండ్ కార్డు పడేలా లేదని అనిపించింది. మొత్తానికి ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ, అనసూయ ఈ విషయంలో ఒక మెట్టు దిగినట్టు సంకేతాలు ఇచ్చింది.

ప్రస్తుతం అనసూయ నటించిన విమానం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండతో కాంట్రవర్సీ గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందించిన అనసూయ ‘విజయ్ తనకు మంచి ఫ్రెండ్ అని, అర్జున్ రెడ్డి సినిమాలో ఉన్న అభ్యంతరకర డైలాగ్ పై తాను స్పందించిన నాటి నుండి పని కట్టుకొని మరీ తనని ట్రోల్ చేస్తున్నారని, ఈ ట్రోలర్స్ వెనక విజయ్ కి సన్నిహితుడైన ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పింది. విజయ్ ప్రత్యక్షంగా ఎప్పుడూ తనపై కామెంట్స్ చేయనప్పటికీ , ఈ వ్యవహారం తనకి తెలీకుండా ఉంటుందా అని ప్రశ్నించింది.

వ్యక్తిగతంగా తనకి విజయ్ పట్ల ఎలాంటి ద్వేషం లేదు కాబట్టే అతను నిర్మాతగా వ్యవహరించిన మీకు మాత్రమే చెప్తా సినిమాలో నటించానని వెల్లడించింది. విజయ్ తనని ద్వేషిస్తున్నాడేమో తెలీదు కానీ, తనకి వ్యక్తిగతంగా విజయ్ పట్ల ఎలాంటి ద్వేషం లేదని, ఇక్కడితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పింది. మానసిక ప్రశాంతత ముఖ్యమని పేర్కొన్న అనసూయ మొత్తానికి విజయ్ తో వివాదానికి శుభం కార్డు వేసేసింది. అనసూయ వైఖరిలో ఈ సడన్ చేంజ్ కి కారణం మానసిక ప్రశాంతనా లేక భయమా అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు