Athiya Shetty: క్రికెటర్ తో బాలీవుడ్ బ్యూటీ పెళ్ళి డేట్ ఫిక్స్

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అథియా శెట్టి ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని వార్తలు కూడా వస్తున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్లికి అంగీకరించారని, త్వరలోనే గ్రాండ్ వెడ్డింగ్ కు ముహూర్తం ఫిక్స్ అయిందని రూమర్స్ వస్తున్నాయి. గతంలో కూడా వీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నారు అంటూ పలుమార్లు వార్తలు వచ్చాయి. కాగా, తాజాగా ఈ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది.

రాహుల్, అథియా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. జనవరి 23వ తేదీన వీరి వివాహం సునీల్ శెట్టి నివాసం ఖండాలలో జరగనున్నట్లు తెలుస్తోంది. జనవరి 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ వివాహ వేడుకలు నిర్వహించనున్నట్లు సమాచారం.

ఈ వివాహ వేడుకకు అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీ నుంచి సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, జాకీ శ్రుఫ్ తదితరులు మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం. అదే విధంగా క్రీడారంగం నుంచి ధోని, కోహ్లీ వంటి స్టార్ క్రికెటర్లు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ జంట ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం అందుతుంది.

- Advertisement -

For More Updates : 

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు