Gopichand : బాలయ్య సూచించిన టైటిలే ఫిక్స్

మ్యాచో స్టార్ గోపిచంద్ ప్రస్తుతం తన కెరీర్ లో గడ్డు పరిస్థితిని అనుభవిస్తున్నాడు. 2014 లో వచ్చిన ‘లౌక్యం’ హిట్ తర్వాత మళ్లీ అంతటి విజయాన్ని అందుకోలేడు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ కూడా దాదాపు ఫ్లాప్ అయ్యాయి. మధ్యలో సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ‘సీటీమార్’ అనే సినిమా కొంత వరకు పర్వలేదని అనిపించినా, విజయాన్ని మాత్రం కట్టబెట్టలేదు. దీంతో గోపిచంద్ కు హిట్ అనేది కలగానే మిగిలిపోయింది.

ఇటీవల భారీ అంచనాలతో వచ్చిన ‘పక్కా కమర్షియల్’ కూడా నిరాశ పరిచింది. దీంతో తనకు రెండు మంచి హిట్స్ ఇచ్చిన శ్రీ వాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు గోపిచంద్. శ్రీ వాస్ దర్శకత్వంలో గోపిచంద్ ఇప్పటి వరకు ‘లక్ష్యం’ ‘లౌక్యం’ సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందించాయి.

ఇప్పడు హిట్ లేక సతమతమవుతున్న గోపిచంద్ కు శ్రీవాస్ మూడో విజయాన్ని అందించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వప్రసాద్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా డింపుల్ హయాతీ నటిస్తోంది. కీలక పాత్రల్లో జగపతిబాబు, ఖుష్బూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మూవీ చిత్రీకరణ దశలో ఉంది.

- Advertisement -

అయితే శ్రీవాస్ – గోపిచంద్ మూవీ టైటిల్ లో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సెంటిమెంట్ ను ఫాలో కానున్నారని సమాచారం. ఇదే విషయాన్ని నందమూరి బాలయ్య తన అన్ స్టాపబుల్ షోలో కూడా చెప్పాడు. అంతే కాదు.. వీరి సినిమాకు ‘రామ బాణం’ అనే టైటిల్ ను కూడా సూచించారు. దీంతో శ్రీవాస్ – గోపిచంద్ సెంటిమెంట్ కు అనుగూణంగా ఉన్న ఈ టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

అయితే ఇది నిజమో.. కాదో.. తెలియాలంటే టైటిల్స్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు