Madhavi Latha: పెళ్లికి ముందే.. ఆ పని చేయాల్సిందే…!

టాలీవుడ్ హీరోయిన్ మాధవి లత గురించి తెలియని వారు ఉండరు. నచ్చావులే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన మాధవి లత ఫస్ట్ సినిమాతోనే చాలా పెద్ద సక్సెస్ సాధించారు. ఈ సినిమాలో నచ్చావులే పాట ఎంత బాగా పాపులారిటీ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత నానితో కలిసి స్నేహితుడా, అరవింద్2 వంటి సినిమాల్లో నటించి అలరించింది. ఈ సినిమాకి ముందు ఆమె కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు.
అలాగే మహేష్ బాబు హీరోగా వచ్చిన అతిధి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా కూడా నటించారు. ఈ విధంగా మాధవి లత కెరియర్ స్టార్ట్ అయింది. అయినా ఎందుకో డైరెక్టర్లు మాధవి లతకు ఆఫర్స్ ఇవ్వలేకపోయారు. ఈ క్రమంలోనే సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న మాధవి లత నిత్యం పలు విషయాలపై స్పందిస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. నేను పెళ్లి చేసుకోవడానికి అసలు సిద్ధంగా లేనట్టు ఈ హీరోయిన్ మాధవి లత సంచలన ప్రకటన చేసింది.
అక్కడితో ఆగకుండా పలు కీలక వాక్యాలు కూడా చేసింది ఈ బ్యూటీ. డియర్ సొసైటీ…ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి వయసు ముఖ్యం కాదని వెల్లడించింది. శారీరకంగా మరియు మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని సూచనలు చేసింది హీరోయిన్ మాధవి లత. ప్రస్తుతం నేను అందుకు సిద్ధంగా లేనని తేల్చి పారేసింది. భవిష్యత్తులోనూ పెళ్లి చేసుకుంటానని నమ్మకం కూడా లేదని…ఇదేనా నిర్ణయం అంటూ సంచలన వాక్యాలు చేసింది మాధవి లత. నా జీవితం సింగిల్ గానే ఉంటుందేమో అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అంటే పరోక్షంగా తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఈ పోస్టు ద్వారా వెల్లడించింది హీరోయిన్ మాధవి లత.
For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు