NBK108 : బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్

అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ” వీర సింహారెడ్డి” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై యువ నిర్మాతలు హరీష్ పెద్ద సాహూ గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మూవీలో అందాల భామ శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ మూవీని 2023 సంక్రాంతికి భారీ స్థాయిలో ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి – బాలకృష్ణ కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. ఈ మూవీలో బాలయ్య సరికొత్త లుక్ లో కనిపిస్తాడని తెలుస్తోంది.

ఈ మూవీకి ” రామారావు గారు” అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారని సమాచారం. ఈ చిత్రంలో బాలయ్య కూతురు పాత్రలో అందాల భామ శ్రీలీల నటిస్తోంది. ఈ మూవీలో ప్రియమణి కూడా ఓ కీలకపాత్రలో నటించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మూవీలో బాలయ్య సరసన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించబోతుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు