HHVM : రంగంలోకి బాలీవుడ్ హీరో

పవర్ స్టార్ కళ్యాణ్ నుంచి వస్తున్న తాజా చిత్రం హరి హర వీరమల్లు. క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ పాత్రను పోషిస్తుంది. ఈ చిత్రం అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతుంది. కానీ, పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాలు, పలు సినిమాల డేట్స్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి అయిన ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైంది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో బాలీవుడ్ హీరో బాబీ డియోల్ నటిస్తున్నారని సమాచారం. బాబీ డియోల్ పాత్ర సినిమాలో కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే బాబీ డియోల్ ఆన్ బోర్డ్ కు కూడా వచ్చారట. ఆయన పై షూట్ కూడా జరుగుతుందని టాక్.

కాగా హరిహర వీరమల్లు సినిమాను ముందుగా సంక్రాంతికి విడుదల చేస్తామని మూవీ యూనిట్ భావించింది. కానీ అనుకున్నంత స్పీడ్ గా షూటింగ్ పూర్తి కాకపోవడం వాయిదా పడింది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఫిక్స్ చేశారు. అప్పటి వరకు సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా వరుసగా డేట్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు