Deepika Padukone : ఎన్టీఆర్ 30 ని రిజెక్ట్ చేసిన దీపికా పదుకోనె

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘యువసుదా ఆర్ట్స్’ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదలైన మోషన్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ లభించింది. ‘ఆచార్య’ ఫలితాన్ని మరిపించి ఓ బిగ్ బ్లాక్ బస్టర్ అందిస్తానని ఎన్టీఆర్ అభిమానులకు కొరటాల ఈ మోషన్ పోస్టర్ ద్వారా భరోసా ఇచ్చాడు.

ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమాకి దర్శకుడు కొరటాల హీరోయిన్ విషయంలో చాలా తంటాలు పడ్డాడు, చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా విషయంలో కూడా కొరటాల హీరోయిన్ వెతుకులాట పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే జాన్వి కపూర్, కియారా అద్వానీ, అలియా భట్ వంటి స్టార్ హీరోయిన్లని సంప్రదించగా వారు ఈ ఆఫర్ కు సున్నితంగా నొ చెప్పారు. ఈ మధ్యనే దీపికా పదుకోనెని సంప్రదించగా ఆమె కూడా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. నిర్మాతలు భారీ పారితోషికం ఆఫర్ చేసినా ఆమె నొ చెప్పినట్లు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు