Dhanush : వాయిదా పడనుందా ?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగు ప్రేక్షకులను టార్గెట్ గా చేస్తున్న చిత్రం సార్. ధనుష్ తమిళ సినిమాలు తెలుగులో డబ్ అవడం వల్ల ఇక్కడ కూడా ఆయనకు మంచి క్రేజ్ ఉంది. ధనుష్ నటించిన రఘువరన్ బీ టెక్, మారి సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. దీంతో ధనుష్ తన మార్కెట్ ను తెలుగులో విస్తారించాలని ప్లాన్ వేస్తున్నారు. అందుకోసం ఆయన డైరెక్ట్ తెలుగు దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నారు.

టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేస్తున్న లేటెస్ట్ చిత్రం సార్. తమిళంలో వాతి. ద్వి భాష చిత్రంగా ఇది రాబోతుంది. ధనుష్ కు జోడీగా భీమ్లా నాయక్ ఫేం సంయుక్తా మీనన్ నటిస్తుంది. విలక్షణ నటుడు సాయి కుమార్ విలన్ పాత్ర చేయబోతున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కలిసి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాయి.

ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ స్టోరీ తో వస్తుందని ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్ లతో తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ చిత్రం గురించి ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతుంది. ఈ చిత్రం అనుకున్న డేట్ కంటే ఆలస్యంగా రానున్నట్టు తెలుస్తుంది. ముందుగా సార్ చిత్రాన్ని డసెంబర్ 2న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాని సందర్భంగా మూవీ టీం వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అందుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి కాకుండా ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తారని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు