Kushi: సమంతకి చైతు ఇవ్వనిది విజయ్ ఇచ్చాడా..?

లేడీ సూపర్ స్టార్ సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరో హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టర్కీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.అయితే, ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లో సమంత, విజయ్ రెస్టారెంట్ కి వెళ్లి చిల్ అవుతూ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటో పోస్ట్ చేస్తూ విజయ్ గురించి సమంత ఇచ్చిన క్యాప్షన్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. విజయ్ తన లైఫ్ లో స్పెషల్ పర్సన్ అంటూ అర్థం వచ్చేలా ఆ క్యాప్షన్ ఉండటంతో ఇద్దరి మధ్య స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉందన్న సంకేతాలు వస్తున్నాయి.

మిడిల్ క్లాస్ నేపథ్యం నుండి వచ్చి టాప్ హీరోయిన్ గా ఎదిగిన సమంత నాగచైతన్యతో వివాహ బంధాన్ని కొనసాగించలేక డైవర్స్ తీసుకుంది. ఆ తర్వాత ఇండిపెండెంట్ గా జీవిస్తున్న సమంత ప్రస్తుతం విజయ్ తో క్లోజ్ గా మూవ్ అవ్వటంపై సోషల్ మీడియాలో రూమర్లు తెగ వినిపిస్తున్నాయి. ఇద్దరు జీరో నుండి స్టార్ గా ఎదిగిన నేపథ్యం ఉన్నవారు కావడంతో, మహానటి సినిమాలో కలిసి నటించింది చిన్న రోల్స్ అయినప్పటికీ ఆ నాటి నుండి ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యింది. ఆ తర్వాత ఖుషి సినిమా నాటికి ఒకరకంగా ఇద్దరు బ్యాడ్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఒకరికొకరు సపోర్ట్ గా నిలవడం వల్ల సమంత, విజయ్ మధ్య రిలేషన్ మరింత స్ట్రాంగ్ అయ్యిందని అంటున్నారు.

అయితే, నాగచైతన్య బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ కావటం వల్ల సమంతకు ఆశించిన ప్రోత్సాహం ఇవ్వకుండా డామినేట్ చేసేవాడని, అదే డైవర్స్ కి దారి తీసిందని, ఇప్పుడు సమంత బ్యాడ్ పేజ్ లో ఉన్న సమయంలో విజయ్ ఎంకరేజ్ చేయటం వల్లే సమంత అతనికి దగ్గరైందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి, టర్కీలో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ సందడి చేస్తున్న ఈ ‘ఖుషి’ కపుల్ ఫ్రెండ్షిప్ అటు సినీ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు