Hansika: పెళ్లి టీజర్ విడుదల

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన దేశముదురు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక మోత్వాని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ మంచి పాపులారిటీ ఉన్న నటి హన్సిక మోత్వాని. అనేక భాషల్లో నటించి దాదాపు అన్ని ఫిలిం ఇండస్ట్రీలలో మంచి పేరు తెచ్చుకుంది.

అయితే హన్సిక మోత్వాని 2022 డిసెంబర్ 4వ తేదీన సోహైల్ కతూరియాను వివాహం చేసుకోవడం తెలిసిందే. ప్రియుడు సోహెల్ తో ఏడడుగులు వేసింది హన్సిక. డిసెంబర్ 4వ తేదీన జైపూర్ లోని ముందోత ఫోర్ట్ ప్యాలెస్ లో హన్సిక, సోహెల్ పెళ్లి వైభవంగా జరిగింది. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. అయితే పెళ్లికి ముందే హన్సిక సోహెల్ తో రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు చెబుతున్నారు.

అయితే హన్సిక కు ఇది మొదటి వివాహం కాగా సోహెల్ కు మాత్రం ఇది రెండవది. గతంలో హన్సిక స్నేహితురాలు రింకి బజాజ్ ను సోహెల్ పెళ్లి చేసుకున్నారు. మనస్పర్ధలతో ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు సోహెల్. ఇదిలా ఉంటే.. హన్సిక, సోహెల్ వారి పెళ్లిని ఓ సినిమా మాదిరిగా ప్రత్యేకంగా చిత్రీకరించుకున్నారు. దీనికి సంబంధించి జనవరి 30న టీజర్ విడుదలైంది.

- Advertisement -

హన్సిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ టీజర్ ను పోస్ట్ చేశారు. ఈ సినిమాకి “లవ్ షాది డ్రామా” అని పేరు పెట్టారు. ఈ ప్రోమోలో నటి తన పెళ్లికి ముందు జరిగిన వాటి గురించి మాట్లాడడం చూడవచ్చు. తన భర్త సోషల్ యొక్క గత సంబంధాల గురించి పుకార్లను కూడా ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తోంది. వీరి వివాహ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 10న ప్రసారం కానుంది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు