Hansika: ఓటీటీలోకి వెడ్డింగ్ వీడియో

కోలీవుడ్ బ్యూటీ హన్సిక టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. తెలుగులో దేశముదురు సినిమా ద్వారా మొదట ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి హీరోయిన్ గా మంచి పేరుని సంపాదించుకుంది. మొదట చైల్డ్ యాక్టర్ గా ఎన్నో సినిమాలలో నటించిన హన్సిక బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటించింది.

ఈ ముద్దుగుమ్మ ఇటీవల డిసెంబర్ 4న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా ఈమె వివాహం జరిగింది. ముంబై కి చెందిన వ్యాపారవేత్త సోహైల్ కథారియా ను ప్రేమించి వివాహం చేసుకుంది. రాజస్థాన్ జైపూర్ లోని 450 ఏళ్ల పురాతన రాచకోట ” ముందోతా ఫోర్ట్ ప్యాలెస్” లో వైభవంగా ఈ పెళ్లి జరిగింది.

అయితే గత నెల రోజులుగా ఆమె పెళ్లికి సంబంధించిన చిత్రాలు మరియు చిన్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుకొని హల్దీ, సంగీత్, మెహందీ వేడుకలతో పాటు హన్సిక పెళ్లి ముగిసే వరకు రోజుకో పండుగగా జరుపుకుంది. చివరగా వెడ్డింగ్ ముందు రోజు కూడా సంగీత్ లో హన్సిక, సోహైల్ కలిసి డాన్స్ చేసిన వీడియోలు కూడా వైరల్ గా మారాయి.

- Advertisement -

అయితే ఈ మధ్య సెలబ్రిటీల పెళ్లిళ్లు ఓటిటిల్లో ప్రసారం కావడం ట్రెండ్ గా మారింది. ఈ లిస్టులోకి హీరోయిన్ హన్సిక కూడా చేరింది. ఈమె వివాహన్ని ఇప్పుడు ఫ్యాన్స్ కూడా వీక్షించేలా త్వరలోనే ఆ పెళ్లి వీడియో ఓటిటి లోకి రానుందట. ప్రముఖ ఓటిటి ”డిస్నీ ప్లస్ హాట్ స్టార్” ఈ వెడ్డింగ్ వీడియోని హాట్ స్టార్ స్పెషల్ కింద ప్రసారం చేయనుంది. త్వరలోనే ఈ షో ప్రసారం కానున్నట్లు సమాచారం. ఈ మొత్తం వేడుకల హక్కులను ఆమె భారీ ధరకు విక్రయించినట్లు సమాచారం.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు