Hari Hara Veera Mallu : హైప్ కోసం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఉండే హంగామా అంతా ఇంత కాదు. తొలి ప్రేమ, తమ్ముడు నుంచి ఇటీవల వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వరకు పవన్ కళ్యాణ్ కు ఇలాంటి ఇమేజ్ యే ఉంది. పవన్ మధ్యలో సినిమాలకు గుడ్ బై చెప్పి, రాజకీయాలో కీలకంగా మారాడు. అప్పుడు కూడా ఆయన క్రేజ్ కొంత వరకు కూడా తగ్గలేదు. రీ ఎంట్రీలో వచ్చిన వకీల్ సాబ్ ఎంత పెద్ద హిట్ కొట్టిందో అందరికీ తెలుసు. దీంతో పవన్ సినిమా అంటే మినిమం గ్యారింటీ అని మరోసారి రుజువైంది.

కాగా వకీల్ సాబ్, భీమ్లా నాయక్ తర్వాత పవన్ వరుసగా సినిమాలకు సైన్ చేశాడు. ప్రస్తుతం పవర్ స్టార్ చేతిలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరి హర వీరమల్లు, హరిష్ శంకర్ దర్శకత్వంలో భవధీయుడు భగత్ సింగ్, వినోదయ సీతం తెలుగు రీమేక్ సురేందర్ రెడ్డి తో పాటు పలువరు దర్శకులకు పవన్ మాటిచ్చాడు. చేతినిండా సినిమాలు ఉన్నా.. పవన్ కు రాజకీయా నేపథ్యం వల్ల షూటింగ్స్ సక్రమంగా జరగడం లేదు. హరి హర వీరమల్లు కూడా అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది.

ఇప్పటి వరకు ఈ సినిమా కేవలం 50 శాతం వరకే షూటింగ్ జరుపుకుంది. కొత్త షెడ్యూల్ అక్టోబర్ నెలల ప్రారంభమవుతుందని తెలుస్తుంది. దీనికి పవర్ స్టార్ కూడా గ్రీన్ సిగ్నలు ఇచ్చాడు. ఇదిలా ఉండగా, ఇటీవల పవన్ కళ్యాన్ పుట్టిన రోజు సందర్భంగా పవర్ గ్లాన్స్ పేరుతో ఒక టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్ సినిమాపై అంచనాలను పాన్ ఇండియా స్థాయిలో ఒక్కసారిగా పెంచేసింది.

- Advertisement -

దీంతో మూవీ టీం మరో అప్డేట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ అప్డేట్ డిసెంబర్ 31న ఉంటుందని సమాచారం. వచ్చే అప్డేట్ సినిమాపై హైప్ భారీగా క్రియేట్ చేసేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు