Harish Shankar : ఇద్దరిలో ఎవరితో ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే వకీల్ సాబ్,  భీమ్లానాయక్ సినిమాల విజయంతో మంచి జోష్ మీద ఉన్నారు. తాజాగా ప్రస్తుతం పవన్ చేతిలో కొన్ని ప్రాజెక్టులున్నాయి. అందులో ముఖ్యంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు సినిమాని శరవేగంగా పూర్తి చేయబోతున్నారు. మరో నెల రోజులు పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయిస్తే ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ సినిమాకే ప్రియారిటీ ఇస్తున్నారు. ఇటీవలే వర్క్ షాపు, షూటింగ్ లో పాల్గొన్నారు పవన్. 

మరోవైపు వినోదయ సీతం అనే తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారా లేదన్నదే ప్రశ్నార్థకంగా మారింది. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మరోపక్క హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయాల్సిన ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా విషయంలో చాలా డేట్స్ కేటాయించాల్సి వస్తుందని.. సమయం లేక పక్కన పెట్టాడని వార్తలు వస్తున్నాయి. దీంతో హరీష్ శంకర్ మరో హీరో కోసం ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ముంబైలో ఉండి సల్మాన్ ఖాన్ కోసం వెతుకుతున్నట్టు కూడా టాక్ వినిపిస్తోంది. 

అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయాలని హరీష్ శంకర్ కి ఎప్పటి నుంచో ఉందని.. చిరు కూడా ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు. ఈ తరుణంలో తాను ఇష్టపడ్డ ఓ మలయాళ సూపర్ హిట్ మూవీ రీమేక్ కి హరీష్ అయితేనే బెటర్ అని ఫిక్స్ అయ్యారట. మోహన్ లాల్, పృథ్విరాజ్ తండ్రికొడుకులుగా నటించిన హిలేరియస్ సినిమా ఇది. దీనిని తెలుగులో రీమేక్  చేసే బాధ్యతలను హరీష్ శంకర్ తీసుకున్నాడట. తండ్రిగా చిరంజీవి చేస్తారని, తనయుడిగా మెగా హీరో బోర్డులోకి వస్తారని పేర్కొంటున్నారు. 

- Advertisement -

అయితే భవదీయుడు భగత్ సింగ్ సినిమా కథ విపరీతంగా చిరంజీవికి నచ్చింది. మెగా అభిమానులు చిరుతో చేస్తే బాగుంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాజెక్ట్ నే చిరుతో హరీష్ చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న కథని  మెగాస్టార్ తో దర్శకుడు హరీష్ చేస్తాడా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనప్పటికీ పవన్ ఈ సినిమాని పట్టాలెక్కించాలని అనుకుంటున్నారని సమాచారం. ఈ సినిమాను హరీష్ శంకర్ ఎవరితో తీస్తాడనేది కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు