Harish Shankar : ఆశలు వదులుకున్నాడా ?

తెలుగులో హీరోలకు కొదువ లేదు. భారీ స్థాయిలో గుర్తింపు ఉన్నవాళ్లు ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్ హీరోలూ ఉన్నారు. అందుకే ఇతర భాషల్లో పేరు గాంచిన దర్శకులు కూడా తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. చేస్తున్నారు. మరి కొంత మంది దర్శకులు వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి వాతావరణం ఉన్న సందర్భంలో ఒక తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ హీరో కోసం ముంబైకి వెళ్లి, అక్కడే ఉంటున్నాడు అనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది.

ఆ తెలుగు డైరెక్టర్ ఎవరో కాదు.. రీమేక్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టే హరీష్ శంకర్. ఆ బాలీవుడ్ హీరో ఎవరో కాదు.. ఇటీవల తెలుగు సినిమా గాడ్ ఫాదర్ లో తార్ మార్ టక్కర్ మార్ చేసిన సల్మాన్ ఖాన్. ఈ బాలీవుడ్ కండల వీరుడితో సినిమా చేయాలనే ఉద్ధేశంతో హరీష్ శంకర్ ముంబైకి వెళ్లినట్టు, ఆయన కోసం వెయిట్ చేస్తున్నట్టు గత రెండు రోజుల నుంచి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే పైన చెప్పినట్టు తెలుగు దర్శకులకు బయట హీరోలతో సినిమాలు చేయాల్సిన పని లేదు. ఎందుకంటే కావాల్సినంత మంది హీరోలు టాలీవుడ్ లోనే ఉన్నారు.

మరి హరీష్ శంకర్ బాలీవుడ్ హీరో వెంట ఎందుకు పడుతున్నాడు ? అంటే కొన్ని సమాధానాలు వినిపిస్తున్నాయి. హరీష్ శంకర్ నుంచి వచ్చిన చివరి సినిమా గద్దలకొండ గణేష్. ఈ సినిమా 2020 సెప్టెంబర్ లో విడుదల అయింది. అంటే మూడేళ్ల గడుస్తున్న హరీష్ నుంచి ఒక్క సినిమా రాలేదు. కనీసం సెట్స్ పైకి కూడా వెళ్లలేదు. పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ అని ఒక అనౌన్స్ మెంట్ వచ్చింది. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఎందుకంటే.. ఈ సినిమా గురించి గత రెండేళ్ల నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం.

- Advertisement -

అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో హరీష్ సినిమా చేయాలని అనుకున్నాడు. విజయ్ కి హరీష్ శంకర్ కాల్ చేస్తే.. “మీట్ అవ్వడానికి రండి. కానీ స్టోరీ కోసం అయితే వద్దు” అని అనట్టు కూడా ఒక వార్త చాలా రోజుల పాటు వైరల్ అయింది. విజయ్ తో పాటు రామ్ పోతినేనితో కూడా సినిమా చేయాలనుకున్నాడు. అది కూడా జరగలేదు. దీంతో తెలుగు హీరోలను నమ్ముకుంటే లాభం లేదని బాలీవుడ్ బాట పట్టినట్టు అర్థమవుతుంది. నిజానికి టాలీవుడ్ సర్కిల్స్ లో కూడా ఇలాంటి వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. మరీ తెలుగు హీరోలను విడిచిపెట్టిన ఈ దర్శకుడికి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు