Ahimsa: ‘అహింస’పై తేజ హోప్స్ వదిలేసాడా..?

రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన అహింస సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. చాలా కలాం తర్వాత హిట్ కాంబో అయిన తేజ, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాకి కలిసి పనిచేయడంతో అహింస సినిమా ఇద్దరికీ కమ్ బ్యాక్ మూవీ అవుతుందని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో అహింస సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు తేజ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సినిమా అభిరామ్ కోసం చేయలేదని, నిర్మాత రామానాయుడికి ఇచ్చిన మాట కోసం ఆయన మనవడితో సినిమా చేశానని అన్నారు. సినిమాలో అభిరామ్ పెద్దగా యాక్టింగ్ చేయలేదని సురేష్ బాబు అన్నాడని చెప్పుకొచ్చాడు.

సినిమా ప్రైరీలిజ్ ఈవెంట్ లో హైప్ క్రియేట్ చేయటం కోసం ఉన్నవి, లేనివి కలిపి స్పీచ్ ఇచ్చే డైరెక్టర్స్ ఉన్న ఈ రోజుల్లో తేజ ముక్కుసూటిగా మాట్లాడిన మాటలు విన్న ప్రేక్షుకులు సైతం ఆశ్చర్యపోయారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ, సినిమా రిజల్ట్ షూటింగ్ టైమ్ లోనే తనకి అర్థం అవుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రీరిలీజ్ ఈవెంట్ లో తేజ వ్యాఖ్యలు చుస్తే, అహింస సినిమా వర్కౌట్ అవ్వడాన్ని తేజకి ముందే అర్దమైపోయిందా అన్న అనుమానం కలుగుతోంది.

అభిరామ్ నుండి యాక్టింగ్ రాబట్టలేక తేజ విసిగిపోయాడని ఆ మధ్య సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. తేజ స్పీచ్ ఆ వార్తలకు బలం చేకూర్చే విధంగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా నిర్మాత పాయింట్ ఆఫ్ వ్యూలో చుస్తే ప్రీరిలీజ్ ఈవెంట్లో దర్శకుడు తేజ అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అనిపిస్తుంది. సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ప్రేక్షకుడిలో ఆసక్తి పెంచేలా ప్రమోట్ చేయాలి కానీ, ఇలా రిలీజ్ ముందే దర్శకుడే సినిమాపై నెగిటివ్ కామెంట్ చేయడం సమంజసం అనిపించుకోదు. మరి, తేజ ఎదో చెప్పబోయి ఇంకేదో చెప్పాడా లేక తాను అనుకున్నదే చెప్పాడా తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు