Adivi Shesh: పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరో.. డేట్ ఫిక్స్..?

ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ సెలబ్రిటీలు వరుసగా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా పలువురు స్టార్ సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు అదే లిస్టులోకి ప్రముఖ యంగ్ హీరో అడివి శేష్ కూడా యాడ్ అయిపోయారు. ప్రస్తుతం ఈయనకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. గత కొంతకాలంగా అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డతో అడివి శేష్ ప్రేమాయణం కొనసాగిస్తున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతూ ఉండగా దీనిపై ఎవరు కూడా ఏమాత్రం స్పందించలేదు.

మరొకవైపు సుప్రియ, అడివి శేష్ లైఫ్ లో ఎవరికి వారు ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పోతే గతంలో అక్కినేని ఇంట జరిగిన పలు ఫంక్షన్లలో, ప్రైవేట్ పార్టీలో అడివి శేష్ ఫ్యామిలీ పిక్స్ లో కనిపించడమే ఈ రూమర్లకు పెద్ద కారణం అయ్యింది. అయితే ఇన్నాళ్లు వీళ్ళ పెళ్లి గురించి అక్కినేని ఫ్యామిలీ తమ నిర్ణయాన్ని హోల్డ్ లో పెట్టారట. అయితే ఇప్పుడు సమాజంలో మారిన పద్ధతుల కారణంగా అక్కినేని ఫ్యామిలీ కూడా సుప్రియ రెండో పెళ్లికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఇకపోతే అడివి శేష్ మంచి అబ్బాయి కావడంతో సుప్రియ లైఫ్ ను అతడి చేతిలో పెడితే బాగుంటుంది అన్న కారణంతో ఈ నిర్ణయం అక్కినేని కుటుంబ సభ్యులు తీసుకున్నట్లు సమాచారం.

అంతేకాదు డిసెంబర్ 22వ తేదీన వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే ఇప్పటివరకు దీనిపై అటు అడివి శేష్ ఇటు సుప్రియ ఎవరు కూడా స్పందించలేదు. బహుశా నిశ్చితార్థం రోజే ఈ విషయాన్ని బయట పెడతారేమో తెలియాల్సి ఉంది. కొంతమంది ఇది అభిమానులు పుట్టించిన ఫేక్ వార్తని కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది లేదు నిప్పు లేనిదే పొగ రాదు కదా నిజంగానే ఇది జరుగుతుందేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై నిజాలు తెలియాలి అంటే అడివి శేష్ స్పందించక తప్పదు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు