NBK 108 : హనీతో బాలయ్య మరోసారి ?

అఖండ, వీరసింహారెడ్డి తో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇక తన తదుపరి చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించుకుంది. ఈ చిత్రం మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, లెజెండరీ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు ముఖ్య అతిథులుగా విచ్చేయగా, 2022 డిసెంబర్ 8న పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది.

అంతే కాదు.. సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి టాలీవుడ్ లో పెద్ద ఎత్తున్న చర్చ సాగుతుంది. ముందుగా ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ పాత్ర చేస్తోందని టాక్ వచ్చింది. కానీ తర్వాత మరో ముగ్గురు హీరోయిన్స్ పేర్లు కూడా వినిపించాయి.

తాజాగా మరో పేరు వినిపిస్తోంది. అదే హానీ రోజ్. బాలయ్య బాబు హీరోగా వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలో హీరోయిన్ హనీ రోజ్ స్పెషల్ అట్రాక్షన్ అయింది. వెండితెరపై ఆమె లుక్స్ చూసిన తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తన నటనతో వావ్ అనిపించి, ఒక్కసారిగా జనం దృష్టిలో పడింది హాని రోజ్. వీరసింహారెడ్డి సినిమాలో హనీ రోజ్ పోషించిన మీనాక్షి పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది. దీంతో ఆమెనే ఈ సినిమాకు కూడా ఫైనల్ చేసినట్లు టాక్.

- Advertisement -

అయితే ఇది రూమర్ అని మరో టాక్ వినిపిస్తోంది. NBK108 లో హానీ రోజ్ నటింస్తోంది అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని సమాచారం. అయితే ముగ్గురు హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయట. దీనిలో ఒక పేరును త్వరలో ఫిక్స్ చేస్తారని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

For More Updates :
Grab Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు