BalaKrishna: బాలయ్యతో మాస్ బీట్ లో హాట్ బ్యూటీ

ఒక సినిమాకి కథ,కథనం తో పాటు అద్భుతమైన పాటలు అవసరం,
ఎందుకంటే ఒక ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకొచ్చేవి పాటలే,
సినిమాలో సిచ్యువేషన్ కి తగినట్టు ఒక ఐటెం సాంగ్ పడితే
ఆ ఇంపాక్ట్ ఒక రేంజ్ లో ఉంటుంది.
అప్పటినుండి ఇప్పటివరకు తెలుగు సినిమాలలో చాలా ఐటెం సాంగ్స్ వచ్చాయి.చాలామంది హీరోహీన్స్ ఇప్పటివరకు ఐటెం సాంగ్స్ లో కనిపించారు.

హీరోహీన్స్ ఐటెం సాంగ్స్ చేయడం అనేది కొత్త విషయం కాదు,
ఇప్పటివరకు చాలామంది వచ్చి అలా పాటలో కనిపించరు,
ప్రేక్షకుల గుండెల్లో ఇప్పటికి కొలువున్న కాజు పాప కూడా పక్క లోకల్ అంటూ జనతా గ్యారేజ్ లో స్టెప్పులు వేసింది.
హ్యాపీ డేస్,కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి చిన్న సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న మిల్కి బ్యూటీ తమన్నా కూడా “జై లవ కుశ” సినిమాలో ఐటెం సాంగ్ తో అలరించింది.

వీళ్ళే కాకుండా అప్పటి హీరోయిన్స్ అయిన రాశి,రంభ లాంటి వాళ్ళు కూడా ఐటెం సాంగ్స్ తో అలరించారు.
హీరో రాజశేఖర్ కెరియర్ లో ఆ మధ్య వచ్చిన గరుడ వేగ సినిమా హిట్ అవ్వడానికి కూడా ఆ సినిమాలో “సన్నీ లియోన్” చేసిన ఐటెం సాంగ్ ఏ కారణం.

- Advertisement -

బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో ఒక మాస్ బీట్ ఐటెం సాంగ్ ఉండబోతుందట, ఈ పాటకు హాట్ బ్యూటీ డింపుల్ హయతి బాలయ్యతో స్టెప్పు లేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు