Rebel Star: ఆదిపురుష్ ఓవరాల్ బిజినెస్ ఎంతో తెలిస్తే మతి పోతుంది..!

రెబెల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకతవంలో రామాయణం ఆధారంగా రూపొందిన ఆదిపురుష్ సినిమా విడుదలకి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, జై శ్రీరామ్ పాట సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఆ మధ్య నాసిరకం విజువల్స్ తో వచ్చిన టీజర్ సినిమా యూనిట్ ని ట్రోల్స్ కి గురి చేస్తే, ఆ ట్రోల్స్ అన్నిటికి ట్రైలర్ తో సమాధానం చెప్పింది సినిమా యూనిట్. జూన్ 16న విడుదల కానున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు ఏర్పడ్డ హైప్ మరింత పెంచేలా బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సంబందించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ పీపుల్స్ మీడియా సంస్థ 185కోట్ల కళ్లు చెదిరే రేట్ కి సొంతం చేసుకుంది.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా హిందీ, కన్నడ, ఆదిపురుష్ సినిమా ఓవరాల్ బిజినెస్ సుమారు 550కోట్ల రూపాయల వరకు జరిగిందట. ఇక మ్యూజిక్ రైట్స్ ని సొంతం చేసుకున్న టి సిరీస్ సంస్థ తమిళ్, కన్నడ, హిందీ మలయాళ భాషలకు గాను మ్యూజిక్ రైట్స్ లోకల్ డిస్ట్రిబ్యూటర్లకు ఫ్యాన్సీ రేట్ కి అమ్మిందని సమాచారం అందుతోంది.

తెలుగు రాష్ట్రల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుపుకున్న ఆదిపురుష్ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ సినిమాగా నిలిచే అవకాశం ఉంది. టాలీవుడ్ నుండి సమ్మర్ సీజన్ కి గాను ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ అవ్వకపోవటం ఆదిపురుష్ కి కలిసొచ్చే అంశం అని చెప్పాలి. విడుదలైన మీడియం రేంజ్ సినిమాల్లో దసరా, విరూపాక్ష మినహా ఏ ఒక్క సినిమా కూడా అలరించకపోవటం వల్ల తెలుగు ప్రేక్షకుడు మంచి సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలో విడుదల కానున్న ఆదిపురుష్ కి కుటుంబ సమేతంగా ఆడియెన్స్ క్యూ కట్టడం ఖాయం అని అనిపిస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు