NTR30 : ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపుని తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం జనతా గ్యారేజ్ కాంబోని రిపీట్ చేస్తూ కొరటాల శివ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ప్రాజెక్టు ఎన్టీఆర్ 30. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్న హీరోయిన్ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఇక ఈ చిత్రానికి ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం నుంచి వచ్చిన ఒక మాస్ మోషన్ పోస్టర్ గ్లింప్స్ అందరిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ అప్డేట్ వచ్చి ఆరు నెలలు గుడుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు.

అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ బజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రం నీటి నేపథ్యంలో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్ లోనే ప్లాన్ చేస్తూ ఉండగా వీటికి సంబంధించి చిత్ర బృందం ఇప్పుడు లొకేషన్స్ వేటలో ఉన్నారట. లొకేషన్ ఫైనలైజ్ అయిన వెంటనే ప్లాన్ ప్రకారం షెడ్యూల్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అవ్వాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా వస్తున్న వార్తలు నందమూరి అభిమానుల్లో జోష్ ను నింపాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు