Mokshagna : మే 28న మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్రకటన నిజమేనా..?

సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. అయితే చిరంజీవి, నాగార్జున వారసులు కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించారు. వెంకటేష్ కొడుకు అర్జున్ ఎలాగూ చిన్న పిల్లాడు. చదువుకుంటున్నాడు. అయితే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ తేజ 27 సంవత్సరాల వయసు వచ్చినా హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు.

ఇతని లాంచింగ్ ఎప్పుడు అని బాలయ్య ను ప్రశ్నిస్తే ఏదో ఒక సమాధానం చెప్పేసి దాటేస్తూ ఉంటారు. మామూలుగానే ఆయన ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఇక మోక్షజ్ఞ లాంచింగ్ మేటర్ గురించి అడిగితే సంస్కృతంలో ఇంకేదో మాట్లాడేసి కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటారు.

అయితే అభిమానులు మాత్రం ఓపిగ్గా.. మోక్షజ్ఞ ప్రతీ బర్త్ డేకి వెళ్లి కేక్ కటింగ్ చేయిస్తూ ఉంటారు.ఆ ఫోటోలు వైరల్ అవుతుంటాయి కూడా..! ఇప్పుడు వాళ్ళ నిరీక్షణకి స్వస్తి పలికే టైం వచ్చిందనేది ఇన్సైడ్ టాక్. విషయం ఏంటంటే.. ఓ న్యూస్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. అది కూడా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించే..! మే 28న మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంటుందట.

- Advertisement -

‘బసవ తారక రామ క్రియేషన్స్’ అనే బ్యానర్ పై మోక్షజ్ఞ కొత్త చిత్రం ప్రారంభమవుతుంది అనేది ఆ వార్త సారాంశం. బాలకృష్ణ సొంత బ్యానర్లో తీసిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ ఫ్లాప్ అయ్యింది కాబట్టి బ్యానర్ పేరు మార్చబోతున్నట్టు కూడా భోగట్టా..!

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు