Chiranjeevi : ‘వీర’త్వం.. ఐటెం సాంగ్

యాక్షన్ ఉండాలి. దీంతో పాటు ఐటెం సాంగ్ ఉండాలి. ఇది ప్రస్తుతం సీనియిర్ హీరోలు ఫాలో అవుతున్న స్ట్రాటజీ. సినిమాల్లో మాస్ ఎలివేషన్స్ కి తోడు యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. వీటితో పాటు ఒక స్పెషల్ సాంగ్ వస్తే.. మరింతగా ప్రేక్షకులకు చేరుతుంది. దీని వల్ల సినిమా సేఫ్ సైడ్ ఉంటుంది. ఇలా ప్లాన్ చేస్తున్నారు సీనియిర్ హీరోలు చిరంజీవి, బాలయ్య. నందమూరి బాలయ్య నటిస్తున్న వీర సింహా రెడ్డిలో ఆస్ట్రేలియన్ మోడల్ చంద్రికా రవి చేత స్పెషల్ సాంగ్ చేయిస్తున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా మరో సీనియిర్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న వాల్తేరు వీరయ్య టీం కూడా దీన్నే ఫాలో అవుతున్నారట. చిరంజీవి, రవితేజ కాంబోలో బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ లుక్ వీర మాస్ లెవెల్ లో ఉండబోతుంది. మాస్ ఎలివేషన్స్ కు, యాక్షన్ సన్నివేశాలకు కొదవ ఉండదు. ఈ విషయాన్ని స్వయంగా చిరు, డైరెక్టర్ బాబీ అనేక సందర్భాల్లో చెప్పారు. ఇటీవల వచ్చిన టైటిల్స్ గ్లింప్స్ లో కూడా ఇదే స్పష్టమైంది.

యాక్షన్ కు తోడు ఐటెం సాంగ్ కూడా వాల్తేరు వీరయ్యలో కూడా ఉండబోతుందట. అందు కోసం బాలీవుడ్ ఐటెం బ్యూటీ ఊర్వశి రౌతేలాను రంగంలోకి దింపినట్టు సమాచారం. ఇప్పటికే సాంగ్ షూట్ కూడా పూర్తి అయిందని టాక్. ఈ ఐటెం సాంగ్ లో చిరు, ఊర్వశితో పాటు రవితేజ కూడా మాస్ స్టెప్పులు వేశారని తెలుస్తుంది. నగర శివారులో ఒక అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేసి, పదికి పైగా క్రేన్లను ఉపయోగించి ఈ ఐటెం సాంగ్ ను షూట్ చేశారని టాలీవుడ్ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఈ ఐటెం సాంగ్ కు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కొత్త రకం ట్యూన్ ఇచ్చాడని, ఇది తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని టాక్.

- Advertisement -

మరి ఇంత భారీ లెవెల్ లో తెరకెక్కించిన ఐటెం సాంగ్ ప్రేక్షకులను ఎంత వరకు ఊపేస్తుందో తెలియాలంటే.. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. వాల్తేరు వీరయ్య రాబోయే సంక్రాంతి బరిలో ఉండబోతుందన్న విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు