SSR: మరో సెన్షేనల్ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న జక్కన్న..!

RRR సినిమాతో ఆస్కార్ రేంజ్ కి ఎదిగి టాలీవుడ్ స్థాయిని ఖండంతరాలు వ్యాపింపజేశాడు దర్శకధీరుడు రాజమౌళి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కమిట్ అయిన సినిమా కోసం కథ సిద్ధం చేసే పనిలో పడ్డ జక్కన్న, ఈ సినిమా తర్వాత ఈగ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నదన్న సమాచారం అందుతోంది. అప్పట్లో ఈగ సినిమా సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే రాజమౌళి ఇప్పటివరకు సీక్వెల్స్ మీద దృష్టి పెట్టలేదు కానీ, RRR రిలీజ్ అయ్యాక ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇచ్చాడు. హీరో నాని కూడా ఈగ సినిమాకి సీక్వెల్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడని టాక్ ఉంది.

నాని చాలా సార్లు రాజమౌళి వద్ద ఈగ సీక్వెల్ ప్రస్తావన తీసుకురావడంతో జక్కన్నకి సీక్వెల్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చిందట. ఈ మేరకు తన టీమ్ కి సీక్వెల్ కి సూట్ అయ్యే కథ సిద్ధం చేయమని చెప్పారట. వినిపిస్తున్న రూమర్స్ లో నిజమెంతో తెలీదు కానీ, ఈగ సినిమాకి సీక్వెల్ వస్తే గనక ప్రపంచవ్యాప్తంగా సంచలనం అయ్యే అవకాశం ఉంది.

మహేష్ బాబు సినిమా పూర్తయ్యాక ఈగ2 సినిమా చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడని సమాచారం అందుతోంది. ఈగ పార్ట్ 1 లాగానే పార్ట్ 2కి కూడా లిమిటెడ్ బడ్జెట్ లోనే రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. మహేష్ బాబు సినిమా సినిమా సుమారు 1500కోట్ల బడ్జెట్ తో రూపొందుతుందన్న సమాచారం ఉన్న నేపథ్యంలో ఈగ సినిమాను లిమిటెడ్ బడ్జెట్ లో ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు