NBK108 : యంగ్ హీరోయిన్‌కి తల్లిగా కాజల్ ?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. పెళ్లి, ప్రెగ్నెన్సీ తర్వాత ఇటీవల సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో మూడు కోలీవుడ్, ఒకటి బాలీవుడ్ కు చెందినది. అయితే ఇప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీ గా ఉన్న కాజల్ తెలుగులో కూడా ఓ సినిమాకు సైన్ చేసిందని గత కొద్ది రోజుల నుంచి టాక్ వినిపిస్తోంది.

అనిల్ రావిపూడి, నందమూరి బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న NBK108 లో కాలజ్ అగర్వాల్ హీరోయిన్ గా ఎంపిక అయిందని టాలీవుడ్ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా రౌడీ హీరోయిన్ ప్రియాంక జూవాల్కర్ ఎంపిక అయిందని టాక్ వచ్చింది. దీని తర్వాత వీర సింహా రెడ్డిలో బాలయ్యతో నటించిన హనీ రోజ్ పేరు పరిశీలన  లో ఉందని కూడా టాక్ వచ్చింది.

ఫైనల్ గా మూవీ యూనిట్ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కే మొగ్గు చూపిందని తెలుస్తోంది. ఈ వార్త ప్రచారంలోకి వచ్చినప్పటి నుంచి నెటిజన్లు ఒక అంశాన్ని తెగ వైరల్ చేస్తున్నారు. అదేంటంటే..? NBK108 లో కాజల్ హీరోయిన్ గా ఎంపిక అయితే, ఆమె ఓ యంగ్ హీరోయిన్ కు తల్లి పాత్రలో నటించాల్సి వస్తుందట. అది ఎలా అంటే.. NBK108 లో యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

బాలయ్యకు కూతురి పాత్రలో శ్రీలీల ఉంటుందని, తండ్రి, కూతురి సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చే సినిమా ఇదని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పటికే అధికారిక ప్రకటన చేశాడు. అంటే ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ నటిస్తే, శ్రీలీలకు తల్లిలా కనిపిస్తోందన్నమాట.

అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. NBK108 లో కాజల్ సీన్స్ అన్ని కూడా ఫ్లాష్ బ్యాక్ లో ఉంటాయట. అలాగే కాజల్ చనిపోతుందని, తర్వాత శ్రీలీల బాధ్యతలను బాలయ్య చూసుకుంటాడని తెలుస్తుంది. ఈ క్రమంలో అనుకొని పరిస్థితుల్లో కొన్ని సమస్యల్లో శ్రీలీల చిక్కుకుంటుందని, దాని నుండి తండ్రి బాలయ్య రక్షించడానికి చేసే పోరాటమే సినిమా అని తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

మరి ఇది నిజమో కాదో.. తెలియాలంటే NBK108 విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు